2024-12-06 13:55:39.0
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కొడనాడు హత్య, దోపిడీ కేసులో మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
https://www.teluguglobal.com/h-upload/2024/12/06/1383908-pallanaswamy.webp
తమిళనాడులో సంచలనం రేపిన కొడనాడు హత్య, దోపిడీ కేసులో మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి ప్రతిపక్ష ఏఐఏడీఎంకే నేత ఎడప్పాడి పళనిస్వామి, శశికళ తదితరులను విచారించేందుకు సీబీసీఐడీ పోలీసులకు అనుమతిచ్చింది. వారిద్దరినీ విచారించకుండా ఊటిలోని జిల్లా కోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. 2017లో కొడనాడు ఎస్టేట్‌లో జరిగిన మర్డర్, దోపిడీ కేసుపై తొలుత పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దాదాపు ఐదేళ్లపాటు ఎంక్వరీ కొనసాగినా ఎలాంటి ఫలితం లేకపోయింది. ప్రభుత్వం మారిన తర్వాత కేసు దర్యాప్తును సీఐడీకి అప్పగించారు.
ఈ కేసులో ఇప్పటివరకు 10 మందిని అరెస్టు చేశారు. సుమారుగా 100 మందిని విచారించారు. అయితే కేసులో పళనిస్వామి, శశికళను విచారించేందుకు గతంలో దిగువ కోర్టు అనుమతి ఇవ్వలేదు. దాంతో వారిని కూడా విచారించేందుకు అనుమతి ఇవ్వాలని సీబీసీఐడీ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తాజాగా దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఆ ఇద్దరి విచారణకు అనుమతిస్తూ ఆదేశాలు జారీచేసింది. అంతేకాకుండా ఎస్టేట్‌లో కనిపించకుండా పోయిన కొన్ని విలువైన వస్తువుల గురించి శశికళ, ఇళవరసిని ప్రశ్నించాలని ఆర్డర్ వేసింది.కాగా, 2017లో తమిళనా మాజీ ముఖ్యమంత్రి జయలలితకు చెందిన కొడనాడు ఎస్టేట్‌లో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి వాచ్‌మెన్‌ను ఓం బహదూర్‌ను హత్యచేశారు. ఎస్టేట్‌లోని పలు వస్తువులన దోచుకెళ్లారు.
Madras Highcourt,Kodanad Murder and Robbery Case,Palaniswami,Sasikala,Former Chief Minister Jayalalithaa,Ooty,Tamil Nadu,CM M K Stalin