కొడవలి (కవిత)

2023-01-19 06:58:53.0

https://www.teluguglobal.com/h-upload/2023/01/19/719874-kodavali.webp

ఆకలి తీర్చేందుకు

కోతలు కోసే కొడవలి

అవేశంలో

అన్యాయానికి తలవంచక

పోరాడే వేటకొడవలి

చూసేందుకు చిన్నదైనా

చురుకైన కత్తి అది !

న్యాయ పోరాటాల గుర్తు ఇది

రెపరెపలాడే

ఎర్రని సూర్యుడి కళ్ళల్లో నిప్పు అది

కర్షకుల గుండె బలమే అది

ఆత్మ రక్షణకు అనువైన

ఆయుధం అది

మూరెడు ఎత్తు ఉన్న మొరటిది!

మొలలో నక్కి నక్కి ఉంటుంది

మీసం మెలేస్తే శివతాండవం చేస్తుంది !

బలికోరే బానిసత్వానికి..

బ్రతికించే మానవత్వానికి..

ఊరినడుమ నేలమ్మసిగలో

విరిసిన ఎఱ్ఱమందారం అది..

– జ్యోతి మువ్వల

(బెంగళూరు)

Kodavali,Telugu Kavithalu