కొణతం దిలీప్‌ అరెస్ట్‌

https://www.teluguglobal.com/h-upload/2024/11/18/1378805-konatham-dileep.webp

2024-11-18 10:43:05.0

విచారణ కోసం వచ్చిన దిలీప్‌ ను అరెస్ట్‌ చేసిన సీసీఎస్‌ పోలీసులు

తెలంగాణ డిజిటల్‌ మీడియా మాజీ డైరెక్టర్‌, తెలంగాణ ఉద్యమకారుడు కొణతం దిలీప్‌ ను సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. కోర్టు ఆదేశాలతో విచారణకు హాజరైన దిలీప్‌ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ప్రతీకార చర్యలు మానుకోవాలి : మాజీ మంత్రి హరీశ్‌ రావు

కాంగ్రెస్‌ ప్రభుత్వం కక్షపూరిత, ప్రతీకార చర్యలు మానుకోవాలని మాజీ మంత్రి హరీశ్‌ రావు సూచించారు. తెలంగాణ ఉద్యమకారుడు కొణతం దిలీప్‌ అరెస్ట్‌ ను ఆయన ‘ఎక్స్‌’లో ఖండించారు. ప్రజాప్రభుత్వం అని ప్రచారం చేసుకుంటూ అప్రజాస్వామికంగా వ్యవహరించడం దుర్మార్గమన్నారు. దిలీప్‌ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

Konatham Dileep,Arrest,CCS,Congress Govt,BRS,Social Media