కొణతం దిలీప్‌ రిమాండ్‌పై ప్రభుత్వానికి కోర్టు షాక్‌

https://www.teluguglobal.com/h-upload/2024/11/18/1378962-konatham-dileep.webp

2024-11-18 17:07:00.0

41 నోటీసులు ఇచ్చి ఆయన విడిచిపెట్టాలని పోలీసులను ఆదేశించిన న్యాయమూర్తి

కొణతం దిలీప్‌ రిమాండ్‌ పిటిషన్‌ను న్యాయమూర్తి తిరస్కరించారు. 41 నోటీసులు ఇచ్చి ఆయన విడిచిపెట్టాలని పోలీసులను ఆదేశించారు.సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు సైబర్‌క్రైమ్‌ పోలీసులు మధ్యామ్నం దిలీప్ అక్రమంగా అరెస్టు చేశారు. రిమాండ్ కోసం నేరుగా నాంపల్లి కోర్టు న్యాయమూర్తి ఇంటికి తరలించారు. పోలీసుల రిమాండ్‌ పిటిషన్‌ ను న్యాయమూర్తి తిరస్కరించారు.

కొణతం దిలీప్‌ అక్రమ అరెస్టుపై ప్రజాసంఘాల నేతలు, మేధావులు ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. అక్రమ అరెస్టు అప్రజాస్వామికమని, భావ ప్రకటనా స్వేచ్ఛకు విఘాతమని సోషల్‌మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ప్రజా ప్రభుత్వ పాలనలో అక్రమ అరెస్టులు, నిర్బంధాలు సరికాదంటున్నారు. 

Konatham Dileep,Arrest,CCS,Congress Govt,BRS Social Media,Judge rejected,Remand petition