కొత్తగా మరో టీటీడీ బోర్డు సభ్యుడి నియామకం

2024-11-01 15:16:51.0

తిరుమల నూతన పాలక మండలిని ఇటీవల ఏపీ ప్రభుత్వం నియమించారు. తాజాగా కొత్తగా మరో టీటీడీ బోర్డు సభ్యుడికి అవకాశం కల్పించారు.

https://www.teluguglobal.com/h-upload/2024/11/01/1374258-ttd.webp

టీటీడీ కొత్త పాలక మండలిని ఇటీవల ఏపీ ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. ఛైర్మన్‌గా బీఆర్‌ నాయుడుతో పాటు మరో 23 మంది సభ్యులను ప్రకటించారు. తాజాగా ఇవాళ దేవాదాయశాఖ విడుదల చేసిన జాబితాలో బీజేపీ నేత జి.భానుప్రకాశ్‌రెడ్డి పేరు చేర్చారు. ఎక్స్‌అఫిషియో సభ్యులుగా దేవాదాయశాఖ కార్యదర్శి, దేవాదాయశాఖ కమిషనర్‌, తుడా ఛైర్మన్‌, తిరుమల ఈవో కొనసాగనున్నారు.