2025-02-06 06:13:29.0
ఫిబ్రవరి 10న ప్రధాని మోడీతో పాటు బాలీవుడ్ నటీనటులు, ఇతర రంగాల ప్రముఖులు కూడా పాల్గొననున్నట్లు అధికారులు వెల్లడి
https://www.teluguglobal.com/h-upload/2025/02/06/1400812-pariksha-pe-charcha.webp
పరీక్షలంటే విద్యార్థుల్లో భయాన్ని పోగొట్టడానికి ప్రధాని మోడీ ఏటా ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం విదితమే. ఈ ఏడాది కూడా ఫిబ్రవరి 10న ఢిల్లీలోని భారత్ మండపం టౌన్ హాల్‌లో ఏర్పాటు చేశారు. అయితే ఎప్పటివలె కాకుండా ఈసారి ‘పరీక్షా పే చర్చ’ ను కొత్త ఫార్మాట్‌లో సరికొత్తగా నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ ఏడాది ప్రధాని మోడీతో పాటు బాలీవుడ్ నటీనటులు, ఇతర రంగాల ప్రముఖులు కూడా పాల్గొననున్నట్లు అధికారులు వెల్లడించారు.
నటీనటులు దీపికా పదుకొణె, విక్రాంత్ మస్సే, భూమి పడ్నేకర్, సద్గురు జగ్గీ వాసుదేవ్, ప్రముఖ బాక్సర్ మేరీ కోమ్, పారా అథ్లెట్ అవని లేఖరా, హిమతా సింగ్కా, టెక్నికల్ గురుజీ గౌరవ్ చౌధరి వంటి ప్రముఖుల పాడ్‌కాస్ట్ ఎపిసోడర్స్‌ను ప్రదర్శించనున్నారు. వీరు తమ అనుభవాలను విద్యార్థులతో పంచుకుని వారిలో స్ఫూర్తి నింపనున్నారు.
Pariksha Pe Charcha 2025,Deepika Padukone,Sadhguru,Vikrant Massey,Others To Join PM Modi