https://www.teluguglobal.com/h-upload/2024/11/05/1374886-sit-on-bomb.webp
2024-11-05 05:25:41.0
మద్యం మత్తులో స్నేహితులు విసిరిన సవాల్‌ను స్వీకరించి ప్రాణాలు కోల్పోయిన శబరీష్
దీపావళి రోజున కొత్త వాహనం కోసం స్నేహితులతో పందెం కాసి బాంబు మీద కూర్చుని ప్రాణాలు కోల్పోయిన ఘటన కలకలం సృష్టిస్తున్నది. కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో పండుగ రోజు మద్యం తాగిన మందుబాబులు పటాకులు కాల్చడానికి రోడ్డుపైకి వచ్చారు. ఈ క్రమంలో కార్డ్‌బోర్డ్ కింద అమర్చిన బాంబుపై కూర్చోవాలని శబరీష్ ఆయన స్నేహితులు సవాల్ విసిరారు. వారి ఛాలెంజ్‌ను స్వీకరించిన శబరీష్ ఆ పెట్టెపై కూర్చున్నాడు. బాంబుకు నిప్పు అంటించిన స్నేహితులు దూరంగా వెళ్లగా.. బాంబు భారీ శబ్దంతో పేలింది. దీంతో ఒక్కసారిగా శబరీశ్ పెట్టె పైనుంచి శబరీష్ ఎగిరిపడ్డాడు. ఒక్కక్షణం కూర్చుని చూసిన ఆయన మరుక్షణమే మృతి చెందాడు. పేలుడు ధాటికి వచ్చిన షాక్స్ వేవ్స్ వల్ల ఆయన అంతర్గత అవయవాలు దెబ్బతిన్నాయని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు బాధ్యులైన శబరీష్ ఆరుగురు స్నేహితులను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు వెల్లడించారు.
Man Sits On Firecracker,Bet For New Vehicle,Explosion Kills,Sabarish