2025-01-12 08:02:24.0
ఈ నెల 26 నుంచి కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులు చేస్తామని మంత్రి పొన్నం ప్రకటించారు
ఈ నెల 26 నుంచి కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇవాళ హైదరాబాద్ లోని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో అధికారులు, గ్రేటర్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ నెల 16 నుంచి 20వ తేదీ వరకు ఫీల్డ్ వెరిఫికేషన్ ఉంటుందన్నారు. జనవరి 20-24 మధ్య వార్డుల వారీగా ప్రజాభిప్రాయ సేకరణ ఉంటుందని ఆయన వివరించారు. 21 నుంచి 25 మధ్యలో డేటా ఎంట్రీ పూర్తి కానుందని మంత్రి తెలిపారు. ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని ప్రకటించారు మంత్రి పొన్నం ప్రభాకర్. అర్హులైన లబ్ధి దారులకు అందరికీ రేషన్ కార్డులు అందుతాయి..గత పదేళ్లుగా రేషన్ కార్డులు విడుదల కాలేదని గుర్తు చేశారు.
పెళ్ళైన మహిళలు ఒక ఇంటి నుంచి మరొక ఇంటికి వెళ్లిన వాళ్లకు పేర్లు మార్చునే అవకాశం కూడా ఉంటుందని తెలిపారు. ప్రజలు కూడా ప్రభుత్వం ఇచ్చే ఈ అవకాశం వినియోగించుకోవాలని కోరారు.సీఎంకు రూ.88.55 కోట్ల సింగరేణి కాలరీస్ డివిడెండ్ చెక్కుఈ నెల 21 నుంచి అర్హులైన వారి వివరాలను డేటా ఎంట్రీ చేస్తామని తెలిపారు. 26 నుంచి కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ఉంటుందని అన్నారు. ఇక ఇందిరమ్మ ఇళ్ల కోసం కూడా త్వరలోనే దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. హైదరాబాద్‌లో స్థలం ఉండి ఇళ్లు లేని వారికి మొదటి ప్రాధాన్యత ఉంటుందని ప్రతి నిరుపేదకు ఇళ్లు ఇవ్వడమే తన ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అన్నారు. అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి త్వరలోనే లబ్ధిదారులకు కేటాయిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
Indiramma Houses,Minister Ponnam Prabhakar,New Ration Cards,Singareni Collieries,Hyderabad,GHMC officials,CM Revanth reddy,Congress party,GHMC Mayor Vijaya laxmi