కొత్త రేషన్​ కార్డు లబ్ధిదారులకు గుడ్ న్యూస్

2025-02-07 14:52:03.0

కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు ఆన్ లైన్ లోనే దరఖాస్తు చేసుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది.

తెలంగాణలో కొత్త రేషన్ కార్డులపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇకపై నూతన రేషన్ కార్డుల కోసం ఆన్ లైన్ లోనే దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. కొత్త రేషన్ కార్డులు మాత్రమే కాకుండా ఇప్పటికే ఉన్న రేషన్ కార్డుల్లో పేరు మార్పులు, చిరునామా మార్పులు, ఇతర మార్పులు అవసరమైనా వాటిని కూడా ఆన్ లైన్ ద్వారా సులభంగా అప్డేట్ చేసుకునే అవకాశం కల్పించింది. ఈ ప్రక్రియను ఈజీగా చేసేందుకు ప్రభుత్వం మీ సేవా కేంద్రాల ద్వారా ఆన్ లైన్ దరఖాస్తును అందుబాటులోకి తెచ్చింది.

ప్రజలు తమ సమీపంలోని మీసేవ కేంద్రాలను సందర్శించి అవసరమైన మార్పులు, కొత్త దరఖాస్తులను చేసుకోవచ్చని అధికారులు స్పష్టం చేశారు. కొత్త రేషన్ కార్డుల జారీ ఎప్పటికీ కొనసాగుతుందని.. దీనికి ఒక నిర్ధిష్టమైన గడువు లేదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. రేషన్‌ కార్డుల మంజూరుకు సంబంధించిన మార్గదర్శకాలను ఇప్పటికే ప్రభుత్వం విడుదల చేసింది.

new ration cards,Telangana Goverment,CM Revanth reddy,Telangana,Congress goverment,Department of Civil Supplies,Meeseva service centers,minister uttam kumar reddy