2025-01-28 10:02:29.0
కొమురవెల్లి ఆలయం వద్ధ కత్తితో అఘోరీ బీభత్సం సృష్టించింది
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి ఆలయం వద్ద అఘోరీ హల్‌చల్ చేసింది. ఆలయ ప్రధాన ద్వారం నుంచి స్వామివారి దర్శనానికి అనుమతి ఇవ్వాలని మొండిపట్టు పట్టింది. అయితే బట్టలు వేసుకొని స్వామి వారి దర్శనానికి రావాలని ఆలయ అధికారులు సూచించారు. దీంతో ఆగ్రహించిన అఘోరి తాను తెచ్చిన కత్తితో పలువురిపై దాడి చేసింది. మొదటి నుంచి కూడా అఘోరీ తన తెలుగు రాష్ట్రాల్లో తన వివాద్పద వైఖరితో ఉద్రిక్తతలు సృష్టిస్తున్నారు.
సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడిలో పూజలతో మొదలైన మహిళా అఘోరి శ్రీకాళహస్తి సహా ఏపీలోని పలు దేవాలయాల సందర్శనల సందర్భంగా గొడవకు దిగింది. శ్మశానాల్లో క్షుద్ర పూజలు చేస్తూ ఓసారి..మగ వేష ధారణలో మరోసారి కనిపిస్తూ ఏ రోజు ఎక్కడ దర్శనమిస్తుందో తేలియనంతంగా నిరంతరం ప్రయాణాలు..దైవ దర్శనాలు చేస్తూ తెలుగు రాష్ట్రాల్లో హల్చల్ చేస్తుంది.
Aghori,Komuravelli Temple,Knife attack,Many Injured,Siddipet District,Occult worship,Srikalahasti