కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌కు బెయిల్‌

https://www.teluguglobal.com/h-upload/2024/10/24/1372038-jani-master.webp

2024-10-24 07:43:24.0

అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపుల కేసులో అరెస్టైన జానీ మాస్టర్‌

అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపుల కేసులో కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌కు తెలంగాణ హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ఆయనపై మహిళా అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌ నార్సింగ్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఆయనపై పోక్సో యాక్ట్‌ కింద కేసు నమోదైంది. ఈ క్రమంలోనే గత రెండు వారాలుగా ఆయన చంచల్‌గూడ జైలులో ఉన్నారు. పోక్సో చట్టం కిందట కేసు నమోదు కావడంతో ఆయనకు ప్రకటించిన నేషనల్‌ అవార్డును కూడా నిలిపివేస్తున్నట్లు అవార్డుల కమిటీ ప్రకటించింది. ఈ అవార్డు ఫంక్షన్‌ కోసమే జానీ మాస్టర్‌కు కోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి తనకు బెయిల్‌ మంజూరు చేయాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించగా షరతులతో కూడిన బెయిల్‌ మంజూరైంది. 

High Court,Grants Bail,Choreographer Jani Master,Accused in a POCSO case