కొలువుదీరిన ‘మహా’ కొత్త ప్రభుత్వం

2024-12-05 12:32:48.0

సీఎంగా ఫడ్నవీస్‌.. డిప్యూటీలుగా శిండే, పవార్‌ ప్రమాణ స్వీకారం

https://www.teluguglobal.com/h-upload/2024/12/05/1383547-modi-fadnavis.webp

మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. గురువారం సాయంత్రం దక్షిణ ముంబయిలోని ఆజాద్‌ మైదాన్‌లో నిర్వహించిన ప్రమాణ స్వీకారోత్సవానికి బీజేపీ, శివసేన, ఎన్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్‌, ఉప ముఖ్యమంత్రులుగా ఏక్‌నాథ్‌ షిండే, అజిత్‌ పవార్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. ఫడ్నవీస్‌ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఇది మూడోసారి. ఈ ఉత్సవంలో ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర మంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌, జేపీ నడ్డా, నిర్మలా సీతారామన్‌, నితిన్‌ గడ్కరీ, ఏపీ, యూపీ, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ సీఎంలు చంద్రబాబు నాయుడు, యోగి ఆదిత్యనాథ్‌ దాస్‌, మోహన్‌ యాదవ్‌, భజన్‌లాల్‌ శర్మ, ఇతర ఎన్‌డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు.

Maharashtra,Mahayuti Govt,Devendra Fadnavis,Eknath Shinde,Ajith Pawer,BJP,Shiv Sena,NCP,Narendra Modi,Amith Shah