కోటక్‌ మహీంద్ర బ్యాంక్‌ కు ఆర్‌బీఐ గుడ్‌ న్యూస్‌

2025-02-12 12:38:43.0

క్రెడిట్‌ కార్డుల జారీపై ఉన్న ఆంక్షలు ఎత్తివేత

కోటక్ మహీంద్ర బ్యాంక్‌ కు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గుడ్‌ న్యూస్‌ చెప్పింది. క్రెడిట్‌ కార్డుల జారీపై గతంలో విధించిన ఆంక్షలను ఎత్తివేస్తున్నట్టుగా ఆర్‌బీఐ ప్రకటించింది. ఈమేరకు ఆర్‌బీఐ సీజీఎం పునీత్‌ పాండే బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. బ్యాంకింగ్‌ రెగ్యులేషన్‌ యాక్ట్‌ 1949లోని సెక్షన్‌ 35ఏ కింద కోటక్‌ మహీంద్ర బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డుల జారీపై 2024 ఏప్రిల్‌ 4న ఆంక్షలు విధించింది. బ్యాంక్‌ ఇచ్చిన వివరణతో సంతృప్తి చెంది ఆ ఆంక్షలను తొలగిస్తున్నట్టుగా ఆర్‌బీఐ ప్రకటించింది. తమ కస్టమర్లకు బ్యాంక్‌ కొత్తగా క్రెడిట్‌ కార్డులు జారీ చేయాలని ఆదేశించింది.

Kotak Mahindra Bank,RBI,Credit Cards,Removal of Restrictions