కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం : సీఎం రేవంత్ రెడ్డి

2025-02-21 10:20:11.0

తెలంగాణలో కోటి మంది మహిళల్ని కోటీశ్వరుల్ని చేయడమే తన లక్ష్యమ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు

రాష్ట్రంలో కోటి మంది మహిళల్ని కోటీశ్వరుల్ని చేయడమే తన లక్ష్యం’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. నారాయణపేట జిల్లా అప్పక్‌పల్లిలో రేవంత్‌ రెడ్డి మహిళా సమాఖ్య పెట్రోల్‌ బంకును ప్రారంభించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతు..మహిళలు ఆత్మగౌరవంతో బతకాలని ఏడాదికి రెండు చీరలు ఇస్తున్నామన్నారు. గతంలో మామూలు చీరలు ఇచ్చేవారు. ఇప్పుడు ఖరీదైన చీరలు ఇస్తున్నాం. అంబానీ, అదానీలు పోటీపడే సోలార్‌ ప్రాజెక్ట్‌లలో మహిళలను ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు. మహిళలు వ్యాపారంలో వేగంగా ఎదిగేలా వారిని ప్రోత్సహిస్తున్నామన్నారు. దేశంలోనే తొలిసారి మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్‌ను ఏర్పాటు చేసుకోవడం సంతోషమని. ఈ ప్రభుత్వంలో మహిళలకే మొదటి ప్రాధాన్యత ఉంటుంది. మహిళలు ఆత్మగౌరవంతో బ్రతుకుతారని మా ప్రభుత్వం ప్రగాఢంగా నమ్ముతోంది. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తరువాత మహిళా స్వయం సహాయక సంఘాలను పునరుద్ధరించాం. రాష్ట్రంలో మహిళా శక్తి 67 లక్షల మంది తెలంగాణలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం.

అన్ని రంగాల్లో మహిళలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.. 600 ఆర్టీసీ బస్సులకూ యజమానులను చేశామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.అద్దాల మేడలు, రంగుల మేడలు అభివృద్ధి కాదు అన్నారు. పేదలకు నాణ్యమైన వైద్యం అందాలన్నారు. మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి పారామెడికల్ విద్యార్థులకు శిక్షణ ఇచ్చి ఇతర దేశాల్లో వైద్య సేవలందించడానికి ప్రణాళికలు రాష్ట్ర ప్రభుత్వం చేస్తోందని తెలిపారు. హాస్పిటల్ ని ఇక్కడికే షిప్ట్ చేయడం జరుగుతుంది. ఏది ఏమైనా జీవితంలో కీలక సమయం అన్నారు. మెడికల్ కాలేజీలకు నిధుల లోటు రానివ్వం అన్నారు. 70ఏళ్ల తరువాత మహబూబ్ నగర్ నుంచి సీఎం అయ్యే అవకాశం వచ్చింది. పాలమూరు బిడ్డగా గర్వంగా మాట్లాడుతున్నా. మారుమూల పల్లెలకు వైద్య సేవలందించాలన్నారు. వైద్య వృత్తి అనేది ఉద్యోగం కాదు.. అది ఒక బాధ్యత అన్నారు.

CM Revanth Reddy,Narayanapet District,Appakpally,Solar projects,Women’s Federation,Mahbub Nagar,Telanagana goverment,minister sittaka,Ponguleti Srinivasa Reddy