2025-02-13 08:49:38.0
మాదాపూర్‌లోని పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి నివాసానికి వెళ్లి నోటీసులు అందజేసిన పోలీసులు
నగర శివారులోని మొయినాబాద్ మండలం తొల్కట్ల ఫామ్‌హౌస్‌లో కోడి పందేల నిర్వహణ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. మాదాపూర్‌లోని ఆయన నివాసానికి వెళ్లి నోటీసులు అందజేశారు. కోడి పందేలా నిర్వహణపై వివరణ ఇవ్వాలని అందులో పేర్కొన్నారు. ఫామ్‌హౌస్‌ను భూపతిరాజు అనే వ్యక్తికి లీజుకు ఇచ్చామని ఎమ్మెల్సీ చెబుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి సమగ్ర సమాచారం ఇవ్వాలని పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చారు.మంగళవారం పొద్దుపోయాక పోలీసులు నిర్వహించిన దాడుల్లో మొత్తం 61 మంది చిక్కిన విషయం విదితమే. వారి వద్ద రూ. 30 లక్షల నగదు, గ్యాంబ్లింగ్‌లో ఉపయోగించే రూ. కోటి విలువైన బెట్టిం్ కాయిన్లు దొరికాయి. పోలీసులు 50 కార్లు, 80 పందెం కోళ్లను స్వాధీనం చేసుకున్నారు.నిందితుల్లో ఎక్కువ మంది వ్యాపారులే. అందరికీ నోటీసులు ఇచ్చి వదిలేశారు. పోలీసులు వస్తున్నసమాచారం అందుకున్న కొందరు పరారయ్యారు. దాంతో పరారైన వ్యక్తులు ఎవరనేదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
Notices,BRS MLC Pochampally Srinivas Reddy,Over Cock Fight case,Moinabad Police