కోలుకుంటున్న సైఫ్‌ అలీఖాన్‌

 

2025-01-17 08:21:41.0

https://www.teluguglobal.com/h-upload/2025/01/17/1395243-saif-ali-khan.webp

శస్త్ర చికిత్స అనంతరం నడుస్తున్నారన్న డాక్టర్లు. తాజా హెల్త్‌ బులిటెన్‌ విడుదల

బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతున్నదని లీలావతి డాక్టర్లు తెలిపారు. ఆయన నడవగలుగుతున్నారని చెప్పారు. ఈ మేరకు తాజాగా మీడియాతో మాట్లాడారు. సైఫ్‌ ఆరోగ్యం మెరుగుపడుతున్నది. ఆయన మాట్లాడగలుగుతున్నారు. అలాగే నడవగలుగుతున్నారు. నడుస్తున్నప్పుడు తీవ్రమైన నొప్పి లేదా ఇతర ఇబ్బందులను ప్రస్తుతానికి గుర్తించలేదు. ఆయనను ఐసీయూ నుంచి సాధారణ గదిలోకి మార్చినట్లు తెలిపారు. వెన్ను నుంచి కత్తిని తొలిగించాం. గాయాల కారణంగా ఇన్‌ఫెక్షన్‌ అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉన్నది. అందుకే ఆయనకు కొంతకాలం విశ్రాంతి సూచించామన్నారు. కొన్ని రోజుల తర్వాత పరిస్థితిని చూసి డిశ్చార్జ్‌ చేస్తామని డాక్టర్లు తెలిపారు.

 

Saif Ali Khan Attack,Recovering,Doing well,Shifted to normal room,Lilavati Hospital