2025-03-03 10:37:29.0
కేకేఆర్ తమ కొత్త కెప్టెన్‌గా అజింక్య రహానేను ప్రకటించింది.
ఐపీఎల్ డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ తమ కొత్త కెప్టెన్‌గా అజింక్య రహానేను ప్రకటించింది. వైస్ కెప్టెన్‌గా వెంకటేశ్ అయ్యర్‌ను నియమించింది. ఈ విషయాన్ని ట్వీట్టర్ ద్వారా తెలిపింది. గత సీజన్‌లో టైటిల్ అందించిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌ను కేకేఆర్ రిటెయిన్ చేసుకోలేదు. ఇక రహానే గతంలో రాజస్థాన్ రాయల్స్, రైజింగ్ పుణే సూపర్‌జెయింట్స్‌ను కెప్టెన్‌గా చేశారు. 2025 సీజన్ కోసం జట్టు కొత్త జెర్సీని కోల్‌కతా ఆవిష్కరించింది. జెర్సీపై మూడు స్టార్లకు చోటు కల్పించింది.
ఈమేరకు ఎక్స్ ద్వారా స్పెషల్ వీడియోను కేకేఆర్ పోస్టు చేసింది. ‘‘జెర్సీ మీద మేం మూడు స్టార్లకు స్థానం కల్పించాం. కేకేఆర్ మూడు టైటిళ్లను సొంతం చేసుకుంది. మే 27, 2012, జూన్ 1, 2014, మే 26, 2024న మేం విజేతలుగా నిలిచాం. మిథున రాశి రోజునే ఇవన్నీ జరిగాయి. చివరిగా వచ్చిన మూడో స్టార్ మమ్మల్ని మళ్లీ అగ్రస్థానానికి చేర్చింది. ఈసారి కూడా అదే ఉత్సాహం ప్రదర్శిస్తాం. మూడు టైటిళ్లకు కర్బో, లోర్బో, జీత్బో అని నామకరణం చేశాం. బెంగాలీ పదాలైన వీటికి ప్రదర్శన, పోరాటం, గెలుపు అని అర్థం.
Kolkata Knight Riders,Ajinkya Rahane,Venkatesh Iyer,IPL 2025,Shreyas Iyer,SRH,RCB,CSK,Rinku Singh