కోల్‌కతా హత్యాచార ఘటన: మళ్లీ ఆందోళన బాట పట్టిన జూనియర్‌ డాక్టర్లు

2024-10-01 06:54:27.0

తమ భద్రతపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి సానుకూల వైఖరి కనిపించడం లేదని డాక్టర్ల ఆరోపణ

https://www.teluguglobal.com/h-upload/2024/10/01/1364866-bengal-doctors.webp

పశ్చిమబెంగాల్‌లోని ఆర్జీకర్‌ ప్రభుత్వ కాలేజీ ఆస్పత్రిలో ఆగస్టు 9న జూనియర్‌ డాక్టర్‌పై జరిగిన హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. హత్యాచారానికి గురైన విద్య విద్యార్థికి న్యాయం చేయాలని, వైద్య కళాశాల్లో భద్రతా చర్యలు తీసుకోవాలని, ఆస్పత్రుల్లో పోలీసుల రక్షణ పెంచాలని, శాశ్వత మహిళా సిబ్బందిని నియమించాలనే డిమాండ్లతో వైద్య విద్యార్థులు 42 రోజుల పాటు విధులు బహిష్కరించారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం హామీ ఇవ్వడంతో గత నెల 21న పాక్షికంగా విధుల్లో చేరిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో మంగళవారం జూనియర్‌ డాక్టర్లు తిరిగి ఆందోళన బాట పట్టారు. తమ భద్రతపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి సానుకూల వైఖరి కనిపించడం లేదని వారు ఆరోపించారు. సెంట్రల్‌ కోల్‌కతాలోని స్క్వేర్‌ కాలేజీ నుంచి ధర్మతల వరకు బుధవారం డాక్టర్లు మార్చ్‌నకు పిలుపునిచ్చారు. తమతోపాటు ఈ మార్చ్‌లో పాల్గొనాలని ప్రజలను కోరారు.

మా భద్రతకు సంబంధించిన డిమాండ్లను నెరవేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల వైఖరి కనిపించలేదు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చర్చల సమయంలో ఇచ్చిన హమీలు నెరవేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదు. ఈ నేపథ్యంలోనే తమ విధులకు శాశ్వతంగా విరమణ తెలిపి ఆందోళన కొసాగించాలని నిర్ణయించామని ఓ డాక్టర్‌ పేర్కొన్నారు. అలాగే తమ డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన చర్యలు తీసుకోకపోతే ఇది పూర్తిస్థాయిలో కొనసాగుతుందని వెల్లడించారు.

Bengal Doctors,Resume Strike,Over RG Kar Hospital Killing,Chief Minister Mamata Banerjee