2024-12-25 10:15:46.0
ఈ నెల 27న విచారణకు హాజరుకావాలని నోటీసులు పేర్కొన్న బంజారాహిల్స్ పోలీసులు
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి బంజారాహిల్స్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. కొద్ది రోజుల కిందట బంజారాహిల్స్ పీఎస్‌లో విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలపై కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఈ నెల 27న (శుక్రవారం) ఉదయం 10 గంటలకు విచారణకు హాజరుకావాలని పేర్కొన్నారు. అయితే తన తండ్రి అనారోగ్యం కారణంగా ఆ రోజు విచారణకు హాజరు కాలేనని, మరో తేదీ ఇవ్వాలని కౌశిక్ పోలీసులను కోరారు.
Police Issue Notice,BRS MLA Kaushik Reddy,Appear for Investigation,Allegedly obstructing,Police duties