https://www.teluguglobal.com/h-upload/2024/10/17/500x300_1369979-doctors-pc.webp
2024-10-17 11:01:17.0
రేపటి నుంచి మూడు రోజుల పాటు నిర్వహణ
దేశంలో క్యాన్సర్, గుండెపోటు వ్యాధులను తగ్గించి.. క్రమేణ నిరోధించడమే లక్ష్యంగా 18వ గ్లోబల్ హెల్త్ సమ్మిట్ నిర్వహిస్తున్నామని అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్ (ఆపి) అధ్యక్షుడు డాక్టర్ సతీశ్ కత్తుల తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు ఈ సమ్మిట్ నిర్వహిస్తున్నామని గురువారం బషీర్ బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ సదస్సులో పరిశోధనలు దేశంలో క్యాన్సర్, గుండెపోటు రావడానికి కారణాలు, జన్యు పరమైన అంశాలు, వాతావరణ పరిస్థితులు ఎంతమేరకు ప్రభావం చూపుతున్నాయో పరిశోధన పత్రాలు సమర్పిస్తారని తెలిపారు. మారిన లైఫ్ స్టైల్ తో ఎలాంటి వ్యాధులు వస్తున్నాయని, వాటిని నిరోధించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సదస్సులో చర్చిస్తారని తెలిపారు. ఈ సదస్సులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, ప్రపంచంలోని వివిధ విద్యవిభాలకు చెందిన నిపుణులు, భారత సంతతి డాక్టర్లు పాల్గొంటారని తెలిపారు.
Global Health Summit,cancer,heart attacks
Global Health Summit, cancer, heart attacks
https://www.teluguglobal.com//health-life-style/global-health-summit-aims-to-prevent-cancer-and-heart-attacks-1071686