https://www.teluguglobal.com/h-upload/2024/10/06/500x300_1366622-grace-cancer-run.webp
2024-10-06 05:47:23.0
ప్రతి ఒక్కరూ ఈ వ్యాధిపై అవగాహన పెంచుకోవాలన్న మంత్రి కోమటిరెడ్డి
క్యాన్సర్ పై అవగాహన కోసం గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ”రన్ ఫర్ గ్రేస్ – స్క్రీన్ ఫర్ లైఫ్ నినాదంతో గచ్చిబౌలి స్టేడియంలో గ్రేస్ రన్ నిర్వహించారు. క్యాన్సర్ దేశంలో లక్షలాది మంది జీవితాలనే చిన్నాభిన్నం చేస్తోందని.. అవగాహనతో వ్యాధి కట్టడికి అందరూ కలిసి రావాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ హెల్త్ ప్రొఫైల్స్ సేకరిస్తుందని, తద్వారా వ్యాధి కట్టడికి కృషి చేస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. గ్రేస్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ లను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా మంత్రి రన్ లో పాల్గొన్న వారితో కలిసి డ్యాన్స్ చేశారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్, గ్రౌస్ ఫౌండేషన్ ప్రతినిధులు చిన్నబాబు సుంకవల్లి తదితరులు పాల్గొన్నారు. రన్ లో విజయం సాధించిన వారికి బహుమతులు అందజేశారు.
వీవెన్ ★ నవంబర్ 17, 2019
Cancer Awareness,Grace Run,Minister Komatireddy Venkat Reddy,Grace Foundation,Gachibowli Stadium
Cancer Awareness, Grace Run, Minister Komatireddy Venkat Reddy, Grace Foundation, Gachibowli Stadium
https://www.teluguglobal.com//health-life-style/grace-run-for-cancer-awareness-1069999