క్లియర్ స్కిన్ కోసం అబ్బాయిలు ఏం చేయాలంటే..

https://www.teluguglobal.com/h-upload/2023/11/17/500x300_857871-clear-skin.webp
2023-11-17 12:29:45.0

అమ్మాయిలతో పోలిస్తే అబ్బాయిలు చర్మ సౌందర్యం మీద అంతగా దృష్టి పెట్టరు. అందులోనూ బయట ఎక్కువగా తిరుగుతుంటారు.

అమ్మాయిలతో పోలిస్తే అబ్బాయిలు చర్మ సౌందర్యం మీద అంతగా దృష్టి పెట్టరు. అందులోనూ బయట ఎక్కువగా తిరుగుతుంటారు. అందుకే చాలామంది అబ్బాయిల స్కిన్ ట్యాన్ అయ్యి ఉంటుంది. మచ్చలు, జిడ్డు చర్మం లాంటి సమస్యలు కూడా ఎక్కువే. మరి ఇలాంటి వాళ్లు క్లియర్ స్కిన్ కోసం ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలంటే.

స్కిన్ ట్యాన్ అయిన అబ్బాయిలు అలాగే మొటిమలు మచ్చలు ఎక్కువగా ఉన్నవాళ్లు ముందుగా ఫేస్ వాష్ చేసుకోవడాన్ని అలవాటు చేసుకోవాలి. రోజులో రెండు మూడు సార్లైనా ఫేస్ వాష్ చేసుకోవాలి. లేదా బయటకు వెళ్లి వచ్చిన ప్రతీసారీ చేసుకోవచ్చు.

చర్మాన్ని డీట్యా్న్ చేయడం కోసం అబ్బాయిలు కాఫీ లేదా వాల్నట్స్‌తో చేసిన మెరుగైన స్క్రబ్బర్ వాడి ముఖాన్ని స్క్రబ్ చేసుకోవాలి. ఆ తర్వాత చల్లని నీటిని ముఖాన్ని కడిగేస్తే.. చర్మం మీది మృతకణాలు తొలగిపోతాయి.

బయట ఎక్కువ సమయం గడిపేవాళ్లు రోజుకి తగినంత నీళ్లు తాగాలి. సన్ స్క్రీన్ లోషన్ లేదా మాయిశ్చరైజర్ వంటివి వాడడం అలవాటు చేసుకోవాలి. షేవింగ్ చేసుకున్నాక ఆఫ్టర్ షేవ్ క్రీమ్స్ లేదా మాయిశ్చరైజర్ తప్పక వాడాలి. లేకపోతే ముఖం మీది చర్మం మరింత గరుకుగా మారే అవకాశం ఉంది.

ముఖం మీద మచ్చలు ఉన్న అబ్బాయిలు ఫేస్ మాస్కుల వంటివాటిని ట్రై చేయొచ్చు. ఇవి చర్మాన్ని హైడ్రేట్ చేసి మచ్చలను తొలగిస్తాయి. రెండు స్పూన్ల తేనెలో అర టీస్పూన్ నిమ్మరసం కలిపి ముఖానికి అప్లై చేయాలి. ఇరవై నిముషాల తర్వాత చల్లని నీటితో శుభ్రంగా కడిగేయాలి. ఇలా వారానికి రెండు సార్లయినా చేస్తే క్రమంగా మచ్చలు తగ్గుతాయి.

కళ్ల కింద డార్క్ సర్కిల్స్ ఉన్న అబ్బాయిలు వాటినితొలగించేందుకు తగిన నిద్ర పోవాలి. అలాగే గాడ్జెట్ల వాడకం తగ్గించాలి. డిజిటల్ స్క్రీన్ నుంచి వచ్చే బ్లూ లైట్ వల్ల చర్మం మరింత పాడవుతుంది.

ఇక వీటితోపాటు చర్మ సౌందర్యాన్ని కోరుకునే అబ్బాయిలు డైట్‌లో భాగంగా పండ్లు, కూరగాయలు, నట్స్ ఎక్కువగా తీసుకోవాలి. నూనె పదార్ధాలను తగ్గించాలి. చక్కెర, ఉప్పు ఎక్కువ ఉండే ఆహారాలు కూడా తగ్గిస్తే మంచిది. చర్మాన్ని డీటాక్స్ చేసేందుకు గ్రీన్ టీ లేదా హెర్బల్ టీ వంటివి బాగా పనిచేస్తాయి. డబుల్‌ చిన్, ఫేస్‌ ఫ్యాట్ ఉన్నవాళ్లు ఫేషియల్ వ్యాయామాలు కూడా చేయొచ్చు.

Clear Skin,Skin,Skin Care,Health Tips,Skin Care For Men
Clear Skin, Skin, Skin Care, Skin Care Tips, Tips, Telugu News, Telugu Global News, Latest News, Telugu Global News, Latest Telugu News for health, Health Tips, Health News, Telugu Health News, skin tone for male, Skin Care For Men

https://www.teluguglobal.com//health-life-style/tips-on-how-to-get-clear-skin-for-men-974906