క్షణం

2023-01-14 15:21:26.0

https://www.teluguglobal.com/h-upload/2023/01/14/435312-kshanam.webp

ప్రతి క్షణం

మరుక్షణం

ఓ చరిత్ర.

చరిత్ర పుటలు

పేరుకున్న వల్మీకాలు

కాస్త కదిపితే

ఓ వాల్మీకి ఉద్భవం

వ్యాసుల ఆవిర్భావం

చరిత్ర అవలోకనం

ద్రష్టల ఉవాచ

రూపొందే పవిత్ర కావ్యాలు

మంచీ చెడూ చెప్పే

బడిలో ఉపాధ్యాయులు

క్షణమెప్పుడూ వ్యర్థం కాదు

అర్ధం పరమార్థం

అందించే జ్ఞాని

నిబిడీకృత ఖని

తవ్వుకుంటే

తరగని గని

క్షణం వెంట పరివెత్తు

క్షణక్షణం జీవించు

గ్రహిస్తే మనిషి

లేకుంటే మహిషి

– క్రొవ్విడి వెంకట బలరామమూర్తి

Kshanam,Krovvidi Venkata Bala Ramamurthy,Telugu Kavithalu