ఖైరతాబాద్‌లో న్యాయవాదిపై కత్తితో దాడి

https://www.teluguglobal.com/h-upload/2024/11/12/1377047-attach.webp

2024-11-12 07:12:06.0

ఖైరతాబాద్‌ నుంచి నెక్లెస్‌ రోడ్డువైపు వాకింగ్‌ చేస్తుండగా దాడికి పాల్పడిన దుండగులు

హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో న్యాయవాదిపై కత్తితో దాడి జరిగింది. ఖైరతాబాద్‌ నుంచి నెక్లెస్‌ రోడ్డువైపు వాకింగ్‌ చేస్తుండగా.. గుర్తుతెలియని వ్యక్తులు బైక్‌పై వచ్చి న్యాయవాది కల్యాణ్‌పై దాడికి పాల్పడ్డారు. పెనుగులాటలో న్యాయవాది చేతికి గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సెల్‌ఫోన్‌ కిందపడిపోగా.. దాన్నితీసుకుని దుండగులు పారిపోయారు. కల్యాణ్‌ ఫిర్యాదుతో ఖైరతాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సెల్‌ఫోన్‌ స్నాచింగ్‌ కోసమే ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుల కోసం పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు.

Knife attack,On lawyer,Khairatabad,Thugs