https://www.teluguglobal.com/h-upload/2024/10/05/1366270-burkina-faso.webp
2024-10-05 04:45:14.0
బుర్కినాపాసోలోని బార్సలోగో పట్టణంలో నరమేధం..ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన దారుణం
పశ్చిమ ఆఫ్రికా దేశం బుర్కినా ఫాసోలో అత్యంత భయానక సంఘటన చోటుచేసుకున్నది. బర్సాలోగో పట్టణంలో ఉగ్రవాదులు ఊహకు అందని నరమేధం సృష్టించారు. కొన్ని గంటల వ్యవధిలోనే సుమారు 600 మందిని పిట్టల్ని కాల్చేసినట్లు కాల్చి చంపారు. ఆగస్టులో జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
ఆగస్టు 24న బర్సాలోగో పట్టణంపై బైక్‌లపై వచ్చిన ఉగ్రవాదులు కనిపించినవారిని కాల్చారు. మృతుల్లో అత్యధికులు మహిళలు, చిన్నారులు కావడం గమనార్హం. అల్‌ఖైదా అనుబంధ సంస్థ జమాత్ నుస్రత్ అల్-ఇస్లాం వాల్-ముస్లిమిన్ (జేఎన్‌ఐఎం), ఇస్లామిక్ స్టేట్ అనుబంధ రెబల్స్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ఆ కథనాల్లో పేర్కొన్నాయి. మిలటరీ సూచనతో ఆగస్టు 24న తమను తాము రక్షించుకోవడానికి స్థానికులు కందకాలు తవ్వుతుండగా ఆగ్రహించిన ఉగ్రవాదులు మహిళలను, చిన్నారులను అతి కిరాతకంగా చంపేశారు. మృతదేహాలను సేకరించడానికి మూడు రోజులు పట్టిందని ఓ ప్రత్యక్ష సాక్షి తెలిపాడు.
600 Massacred,Within Hours,Burkina Faso,JNIM,Al-Qaeda