2024-10-14 18:17:37.0
https://www.teluguglobal.com/h-upload/2024/10/14/1368943-batti.webp
తెలంగాణ సినీ పరిశ్రమ ప్రపంచస్థాయికి ఎదగాలనే రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటున్నదన్నడిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
గద్దర్ అవార్డుల కార్యక్రమాన్ని పెద్ద పండుగలా నిర్వహిస్తామని.. ఎప్పుడు నిర్వహించాలో కమిటీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. గద్దర్ అవార్డులకు ఎంపిక కోసం విధివిధానాలు ఖరారు చేయడానికి కమిటీ సభ్యులతో భట్టి సమావేశమయ్యారు. అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే గద్దర్ పేరిట అవార్డులు ఇవ్వాలని కమిటీ సభ్యులకు డిప్యూటీ సీఎం సూచించారు.
ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. గద్దర్ తెలంగాణ ప్రతిరూపం. తెలంగాణ ఆట, పాటను ప్రపంచానికి పరిచయం చేసిన మహోన్నత వ్యక్తి. రాష్ట్రంలో ఏ గ్రామంలో చూసినా ఆయనను అనుకరిస్తూ పాడుతుంటారు. తెలంగాణ సినీ పరిశ్రమ ప్రపంచస్థాయికి ఎదగాలనే రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటున్నది. నంది అవార్డుల ప్రదానోత్సవాన్ని ఒక పండుగలా నిర్వహించేవారు. రాష్ట్ర విభజన తర్వాత గత ప్రభుత్వం ఈ అంశాన్ని పటించుకోలేదని భట్టి విమర్శించారు.
ఈ సమావేశంలో ఆర్థికశాఖ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, గద్దర్ అవార్డు కమిటీ సభ్యులు నర్సింగరావు, తనికెళ్ల భరణి, సురేష్‌బాబు, తమ్మారెడ్డి భరద్వాజ, దిల్ రాజు, వందేమాతరం శ్రీనివాస్, అల్లాణి శ్రీధర్, గుమ్మడి విమల, సమాచార శాఖ కమిషనర్ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.
Gaddar Awards program,Deputy CM Bhatti Vikramarka,Telangana film industry,Grow to global level