గద్దర్ అవార్డుల విధి విధానలు ఏంటంటే?

2025-03-11 11:35:17.0

తెలుగు సినీ నటులకు ఇచ్చే గద్దర్ అవార్డులకు సంబంధించి విధివిధానాలు రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది

తెలుగు సినీ నటులకు ఇచ్చే గద్దర్ అవార్డులకు సంబంధించి విధివిధానాలు తెలంగాణ ప్రభుత్వం ఖరారు చేసింది. ఫీచర్‌ ఫిల్మ్‌, జాతీయ సమైక్యత చిత్రం, బాలల చలనచిత్రం విభాగం, పర్యావరణం, హెరిటేజ్‌, చరిత్రపై తీసే చిత్రాలకు పురస్కారాలు అందజేయనున్నారు. తొలి ఫీచర్‌ ఫిల్మ్‌, యానిమేషన్‌ ఫిల్మ్‌, సోషల్‌ ఎఫెక్ట్‌ ఫిల్మ్‌, డాక్యుమెంటరీ ఫిల్మ్‌, షార్ట్‌ ఫిల్మ్‌ విభాగాల్లోనూ ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. తెలుగు సినిమాపై పుస్తకాలు, విశ్లేషణాత్మక వ్యాసాలు, నటీనటులు, సాంకేతిక నిపుణులకూ ఈ అవార్డును ఇవ్వనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.

టాలీవుడ్‌ను ప్రోత్సహించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం గద్దర్‌ అవార్డులను ఇవ్వనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 2014 నుంచి 2023 వరకూ ఒక్కో ఏడాదికి ఉత్తమ చలన చిత్రానికి అవార్డు ఇవ్వాలని నిర్ణయించింది. అవార్డులకు సంబంధించిన విధి విధానాలను తాజాగా ఖరారు చేసింది. మార్చి 13వ తేదీ నుంచి అవార్డుల కోసం దరఖాస్తులను స్వీకరించనుంది.

Gaddar Awards,CM Revanth Reddy,First feature film,Gaddar Award,Telangana Goverment,Animation film,social impact film,Documentary film,short film,Minister Komatireddy,Tolley wood,kcr,ktr brs party