గన్నవరం ఉడుకుతోంది.. అమరావతి వేడెక్కింది..

2022-06-03 00:17:16.0

ఏపీలో వాతావరణం వేడెక్కింది. గన్నవరంలో అత్యథికంగా 44.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఆ తర్వాత అత్యథిక ఉష్ణోగ్రత అమరావతి(44.4 డిగ్రీలు)లో నమోదైంది. మొత్తమ్మీద ఏపీలో మరో మూడు రోజులపాటు అత్యథిక ఉష్ణోగ్రతలు ఉంటాయని వాతావరణ విభాగం హెచ్చరించింది. విపత్తు నిర్వహణ సంస్థ కూడా ప్రజలను హెచ్చరించింది. అధిక ఉష్ణోగ్రతల కారణంగా ప్రజలెవరూ అత్యవసరమైతే తప్ప రోడ్లపైకి రాకూడదని హితవుపలికింది. రాబోయే మూడు రోజుల్లో అత్యథిక ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలకు చేరుకుంటాయని అంచనా. వేసవి ప్రారంభంలో ఎండలు […]

ఏపీలో వాతావరణం వేడెక్కింది. గన్నవరంలో అత్యథికంగా 44.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఆ తర్వాత అత్యథిక ఉష్ణోగ్రత అమరావతి(44.4 డిగ్రీలు)లో నమోదైంది. మొత్తమ్మీద ఏపీలో మరో మూడు రోజులపాటు అత్యథిక ఉష్ణోగ్రతలు ఉంటాయని వాతావరణ విభాగం హెచ్చరించింది. విపత్తు నిర్వహణ సంస్థ కూడా ప్రజలను హెచ్చరించింది. అధిక ఉష్ణోగ్రతల కారణంగా ప్రజలెవరూ అత్యవసరమైతే తప్ప రోడ్లపైకి రాకూడదని హితవుపలికింది. రాబోయే మూడు రోజుల్లో అత్యథిక ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలకు చేరుకుంటాయని అంచనా.

వేసవి ప్రారంభంలో ఎండలు మండిపోగా.. అసని తుపాను ప్రభావంతో ఏపీ ప్రజలు కాస్త ఊరట చెందారు. అయితే అదేమీ సంతోషించాల్సిన సమయం కాదని, పెనం వేడెక్కిందా లేదా తెలుసుకోడానికి దేవుడు కాసిన్ని నీళ్లు చిలకరించాడని, ఆ తర్వాత సూర్యుడి భగ భగలు తప్పించుకోలేమని సోషల్ మీడియాలో జోకులు పేలాయి. అనుకున్నట్టుగానే అసని తర్వాత కొన్నిరోజులపాటు ముసురు కనిపించినా ఆ తర్వాత ఎండలు విపరీతంగా పెరిగాయి. జూన్ వచ్చినా ఇంకా భానుడి భగభగలు తగ్గలేదు.

మరో మూడు రోజులు కష్టమే..

ఏపీలో మరో మూడురోజులపాటు వేడి గాలుల ప్రభావం తీవ్రంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. శుక్రవారం 157 మండలాల్లో వేడిగాలులు, 83 మండలాల్లో తీవ్ర వేడిగాలులు వీచే అవకాశముందని చెబుతున్నారు. శనివారం 147 మండలాల్లో వేడిగాలులు, 68 మండలాల్లో తీవ్ర వేడిగాలులు ఉంటాయని హెచ్చరించారు. ఆదివారం కూడా అదే పరిస్థితి కొనసాగుతుందని చెబుతున్నారు. తూర్పుగోదావరి, కాకినాడ, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలలో వేడిగాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఇండియన్ మెటిరోలాజికల్ డిపార్ట్ మెంట్(IMD) అంచనాల మేరకు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఈమేరకు హెచ్చరికలు జారీ చేసింది.