2025-01-07 07:07:42.0
ఈ విషయంలో తప్పుడు ప్రచారం చేసిన యూట్యూబ్ ఛానళ్లు, సంస్థలపై క్రిమినల్, పరువు నష్టం కేసులు వేస్తామన్న ఆయన టీమ్
ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావుపై జరుగుతున్న తప్పుడు ప్రచారంపై ఆయన టీమ్ స్పందించింది. కొన్ని యూట్యూబ్ ఛానళ్లు చేస్తున్న దుష్ప్రచారం ఆయన కుటుంబసభ్యులతో పాటు అభిమానులను కలత పెడుతున్నదని తెలిపింది. ఈ మేరకు గరికపాటి సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు.
ఇటీవల కొందరు వ్యక్తులు, కొన్ని యూట్యూబ్ ఛానళ్లు తప్పుడు ప్రచారంతో పరువు తీస్తున్నారు. గరికపాటిపై వారు చేసిన ఆరోపణలన్నీ నిరాధారం.. సత్యదూరం. వేర్వేరు ఘటనల్లో ఎవరెవరికో చెప్పని క్షమాపణలు చెప్పినట్లుగా పేర్కొంటూ ఆయన గౌరవానికి భంగం కలిగించేలా ప్రచారం చేస్తున్నారు. అంతటితో ఆగకుండా పారితోషికాలు, ఆస్తుల విషయంలోనూ అసత్య ప్రచారం జరుగుతున్నది. వీటన్నింటినీ మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ విషయంలో తప్పుడు ప్రచారం చేసిన యూట్యూబ్ ఛానళ్లు, సంస్థలపై క్రిమినల్, పరువు నష్టం కేసులు వేస్తాం. ఇకపై అలాంటి దుష్ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
Garikipati Narasimha Rao,Misinformation,False propaganda against Garikapati,Legal action,Against them