2016-10-26 13:05:56.0
ఒకపక్క ఆడవాళ్ల సంపాదన, సాధికారతల గురించి మాట్లాడుతుంటాం…మరోపక్క వారు బాయ్‌ఫ్రెండ్స్‌మీద, భర్తల మీద ఆధారపడతారని, వారి జేబులు ఖాళీ చేయడానికే పుట్టారని, గర్ల్‌ఫ్రెండ్‌ని మెయింటైన్ చేయాలంటే అడుక్కుతినాల్సిందేనని…జోకులు వినబడుతుంటాయి. సమాజంలో ఆడవాళ్ల ఇమేజ్ అంతా మగవారి ఆలోచనల్లోంచి పుట్టడమే ఇందుకు కారణం. ఇటీవల ఓలా టాక్సీ సర్వీస్ కంపెనీ యు ట్యూబ్‌లో ఒక ప్రకటనని ఉంచింది. ఇందులో ఒక యువకుడు తన గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి మార్కెట్‌లో తిరుగుతుంటాడు. అమె పదేపదే అతడిని ఆపుతూ కనిపించినవల్లా కొంటూ ఉంటుంది. […]
http://www.teluguglobal.com/wp-content/uploads/2016/04/ola-taxi.gif
ఒకపక్క ఆడవాళ్ల సంపాదన, సాధికారతల గురించి మాట్లాడుతుంటాం…మరోపక్క వారు బాయ్‌ఫ్రెండ్స్‌మీద, భర్తల మీద ఆధారపడతారని, వారి జేబులు ఖాళీ చేయడానికే పుట్టారని, గర్ల్‌ఫ్రెండ్‌ని మెయింటైన్ చేయాలంటే అడుక్కుతినాల్సిందేనని…జోకులు వినబడుతుంటాయి. సమాజంలో ఆడవాళ్ల ఇమేజ్ అంతా మగవారి ఆలోచనల్లోంచి పుట్టడమే ఇందుకు కారణం. ఇటీవల ఓలా టాక్సీ సర్వీస్ కంపెనీ యు ట్యూబ్‌లో ఒక ప్రకటనని ఉంచింది. ఇందులో ఒక యువకుడు తన గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి మార్కెట్‌లో తిరుగుతుంటాడు. అమె పదేపదే అతడిని ఆపుతూ కనిపించినవల్లా కొంటూ ఉంటుంది. చివరికి అతను…నా గర్ల్ ప్రెండ్‌ని భరించాలంటే కిలోమీటరుకి 525 రూపాయలు ఖర్చవుతుంది…కానీ ఓలా… కిలోమీటరుకి ఆరురూపాయలకే వస్తుంది అంటాడు.
ఈ ప్రకటనతో ఓలా క్యాబ్స్ మీద సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున దుమారమే లేచింది. ఇందులో స్పష్టంగా స్త్రీలను కించపరచే భావజాలాన్ని వాడారని నెటిజన్లు మండి పడ్డారు. ఓలా క్యాబ్‌ల్లో మహిళలు కూడా ఎక్కుతారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని, ఇకపై ఓలా క్యాబ్ ఎక్కాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తామంటూ కొంతమంది మహిళలు తీవ్ర విమర్శలు చేశారు. ఈ దాడితో ఓలా కంపెనీ ఆ ప్రకటనని నిలిపివేసింది. తమ ప్రకటన కొందరి మనోభావాలను దెబ్బతీసినట్టుగా అర్థమైందని…అందుకే యాడ్‌ని నిలిపివేస్తున్నామని…అయినా ఓలా క్యాబ్ కిలోమీటరుకి ఆరురూపాయలకే వస్తుందని సమాధానం ఇచ్చింది.
ఏది ఏమైనా ఇంట్లో, ఆఫీసుల్లో, కంపెనీ బోర్డుల్లో, స్కూళ్లలో, ఆసుపత్రుల్లో ఆఖరికి అంతరిక్షంలో కూడా సమర్ధవంతంగా పనిచేస్తున్న మహిళలు…తమ ఖర్చులకోసం బాయ్‌ప్రెండ్స్ భుజాలమీద వాలిపోతూనే ఉన్నారని ఊహించడం…భావ దారిద్ర్యమే మరి.
OLA CAB,OLA TAXI