గవర్నర్ తమిళిసైకి బర్త్ డే విషెస్ చెప్పిన సీఎం కేసీఆర్

2022-06-02 09:19:03.0

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్‌కు సీఎం కేసీఆర్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, ప్రజల తరపున ఆమెకు బర్త్ డే విషెస్ చెప్తున్నట్లు సీఎంవో కార్యాలయం గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆమె మరిన్ని ఏళ్లు ప్రజలకు సేవ చేసేలా ఆ భగవంతుడు కరుణించాలని ఆ ప్రకటనలో కోరారు. దీనికి సంబంధించిన లేఖ ప్రతిని సీఎంవో కార్యాలయం తమ ట్విట్టర్ ఖాతాలో కూడా పోస్టు చేసింది. గత కొంత కాలంగా గవర్నర్, తెలంగాణ […]

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్‌కు సీఎం కేసీఆర్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, ప్రజల తరపున ఆమెకు బర్త్ డే విషెస్ చెప్తున్నట్లు సీఎంవో కార్యాలయం గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆమె మరిన్ని ఏళ్లు ప్రజలకు సేవ చేసేలా ఆ భగవంతుడు కరుణించాలని ఆ ప్రకటనలో కోరారు. దీనికి సంబంధించిన లేఖ ప్రతిని సీఎంవో కార్యాలయం తమ ట్విట్టర్ ఖాతాలో కూడా పోస్టు చేసింది.

గత కొంత కాలంగా గవర్నర్, తెలంగాణ ప్రభుత్వం మధ్య విభేదాలు నెలకొన్నాయి. తమిళిసై స్వయంగా కేసీఆర్ మీద కూడా విమర్శలు చేశారు. సీఎం కూడా రాజ్‌భవన్‌కు వెళ్లడం లేదు. తమిళిసై గవర్నర్‌గా కాకుండా బీజేపీ నేతగా వ్యవహరిస్తున్నారని కేటీఆర్ సహా మంత్రులందరూ విమర్శలు గుప్పించారు. కాగా ఇవాళ ఆమె పుట్టిన రోజుతో పాటు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కూడా ఉన్నది. ఈ క్రమంలో గవర్నర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రకటన విడుదల చేయడం చర్చనీయాంశంగా మారింది.

ALSO READ : లోక్‌సభకు పోటీ చేయనున్న కేసీఆర్?

 

Birthday Greetings,CM KCR,governor,Tamilisai Soundararajan