గవర్నర్ మహిళా దర్బారును రద్దు చేయాలి – నారాయణ డిమాండ్

2022-06-09 01:52:29.0

తెలంగాణ గవర్నర్ తమిళిసై పై సీపీఐ నేత నారాయణ విమర్షలు గుప్పించారు. ఆమె రాజకీయాలు చేస్తున్నారని, రాజకీయ కార్యకలాపాలకు రాజ్ భ‌వన్ ను దుర్వినియోగం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రేపటి నుంచి గవర్నర్ ప్రారంభించనున్న మహిళల దర్బార్ లక్ష్మణరేఖను దాటడమే అని నారాయణ మండిపడ్డారు. ఒకవైపు బీజేపీ, తెలంగాణ రాష్ట్రంపై రాజకీయ దాడిని పెంచిందని, మరో వైపు గవర్నర్ ఆ దాడికి ఆజ్యం పోస్తోందని ఆయన విమర్షించారు. గవర్నర్ పాత్ర రాజకీయ పరంగా ఉంది. ఇది ఫెడరల్ […]

తెలంగాణ గవర్నర్ తమిళిసై పై సీపీఐ నేత నారాయణ విమర్షలు గుప్పించారు. ఆమె రాజకీయాలు చేస్తున్నారని, రాజకీయ కార్యకలాపాలకు రాజ్ భ‌వన్ ను దుర్వినియోగం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రేపటి నుంచి గవర్నర్ ప్రారంభించనున్న మహిళల దర్బార్ లక్ష్మణరేఖను దాటడమే అని నారాయణ మండిపడ్డారు.

ఒకవైపు బీజేపీ, తెలంగాణ రాష్ట్రంపై రాజకీయ దాడిని పెంచిందని, మరో వైపు గవర్నర్ ఆ దాడికి ఆజ్యం పోస్తోందని ఆయన విమర్షించారు. గవర్నర్ పాత్ర రాజకీయ పరంగా ఉంది. ఇది ఫెడరల్ రాజ్యాంగ స్పూర్తికి వ్యతిరేకం అని నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ తలపెట్టిన మహిళా దర్బార్ ను వెంటనే రద్దుచేయాలని ఆయన కోరారు.

కాగా, మహిళా దర్బార్ కార్యక్రమాన్ని రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటి గంట వరకు గవర్నర్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకునేవారు 040–23310521కు ఫోన్ చేయవచ్చని, rajbhavanhyd@gov.in అనే మెయిల్ ద్వారా కూడా అనుమతి తీసుకోవచ్చని గవర్నర్ కార్యాలయం ప్రకటించింది.

ALSO READ : జూబ్లీహిల్స్ పబ్ రేప్ ఘటనపై గవర్నర్ సీరియస్

 

mahila darbar,Narayana,Tamilisai Soundararajan