https://www.teluguglobal.com/h-upload/2022/11/26/500x300_428113-health.webp
2022-11-26 06:08:31.0
Exercise for heart health: హృదయ సంబంధ వ్యాధులు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించడానికి ఏ సమయంలో వ్యాయామం చేయాలి అన్న విషయంపై ఇటీవల కొన్ని అధ్యయనాలు జరిగాయి.
ఈ మధ్య కాలంలో తక్కువ వయసు నుంచే గుండె సమస్యలు మొదలవుతున్నాయి. గుండె సమస్యలను తగ్గించుకోవడం కోసం చాలామంది కార్డియో, రన్నింగ్, వాకింగ్, జంపింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్..లాంటి వ్యాయామాలు చేస్తుంటారు. అయితే హృదయ సంబంధ వ్యాధులు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించడానికి ఏ సమయంలో వ్యాయామం చేయాలి అన్న విషయంపై ఇటీవల కొన్ని అధ్యయనాలు జరిగాయి. వాటిలో తెలిసిందేంటంటే..
‘యూరోపియన్ జర్నల్ ఆఫ్ ప్రివెంటివ్ కార్డియాలజీ’లో ప్రచురితమైన స్టడీ ప్రకారం వ్యాయామాలు ఏ సమయంలోనైనా చేయొచ్చని తెలిసింది. అయితే, ముఖ్యంగా ఉదయం 8 నుంచి 11 గంటల మధ్య చేసే శారీరక శ్రమ వల్ల హార్ట్ స్ట్రోక్ ప్రమాదం తగ్గే అవకాశం ఉందని తేలింది.
ఈ స్టడీ కోసం 60 ఏళ్ల వయసున్న 86,657 మంది డాటాను పరిశీలించారు. ఉదయం చేసే వ్యాయామాల ద్వారా షుగర్, ఫ్యాట్లకు సంబంధించిన జీవక్రియలు సజావుగా జరుగుతాయట. వీటివల్ల అధిక బరువు, టైప్-2 డయాబెటిస్ కంట్రోల్లో ఉంటాయని రీసెర్చర్లు చెప్తున్నారు. అయితే, సాయంత్రం చేసే వ్యాయామాల వల్ల క్యాలరీలను బాగా ఖర్చు చేసే సత్తా పెరుగుతుందట. బరువు తగ్గడానికి, యాక్టివ్గా ఉండడానికి ఈవెనింగ్ వర్కవుట్లు బెటర్ అని వాళ్లు అంటున్నారు.
Heart Health,Exercises,Health Tips
Exercises for Heart Health, Exercises, Heart Health, Heart, Health, Health Tips. health updates
https://www.teluguglobal.com//health-life-style/when-to-exercise-for-heart-health-358237