http://www.teluguglobal.com/wp-content/uploads/2016/02/heart.png
2016-02-18 06:06:46.0
ఆహారం తరువాత మనిషికి అవసరమైంది ఆరోగ్యాన్ని అందించే వైద్యులే. అయితే మనదేశంలో డాక్టర్ల కొరత బాగా ఉంది. ఇందుకు ఒక ఉదాహరణ చెప్పాలంటే ఉత్తర ప్రదేశ్‌లో రాష్ట్రం మొత్తం మీద 12మంది మాత్రమే గుండె ఆపరేషన్లు చేసే సర్జన్లు ఉన్నారట. మరి పేషంట్ల సంఖ్య ఎంతనుకుంటున్నారు 1.5కోట్లు. ఒక సర్జన్ సంవత్సరానికి 300 అపరేషన్లు మాత్రమే చేయగలడు. అలా చూస్తే సంవత్సరానికి దాదాపు 4వేల మందికి మాత్రమే గుండె వైద్యం అందుబాటులోకి వస్తుందన్నమాట. . సంజీవ్ గాంధీ […]
ఆహారం తరువాత మనిషికి అవసరమైంది ఆరోగ్యాన్ని అందించే వైద్యులే. అయితే మనదేశంలో డాక్టర్ల కొరత బాగా ఉంది. ఇందుకు ఒక ఉదాహరణ చెప్పాలంటే ఉత్తర ప్రదేశ్‌లో రాష్ట్రం మొత్తం మీద 12మంది మాత్రమే గుండె ఆపరేషన్లు చేసే సర్జన్లు ఉన్నారట. మరి పేషంట్ల సంఖ్య ఎంతనుకుంటున్నారు 1.5కోట్లు. ఒక సర్జన్ సంవత్సరానికి 300 అపరేషన్లు మాత్రమే చేయగలడు. అలా చూస్తే సంవత్సరానికి దాదాపు 4వేల మందికి మాత్రమే గుండె వైద్యం అందుబాటులోకి వస్తుందన్నమాట. .
సంజీవ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో నిర్వహించిన ఇండియన్ అసోసియేషన్ ఆప్ కార్డివాస్క్యులర్ అండ్ థొరాసిక్ సర్జన్స్ సాంవత్సరిక సమావేశ కార్యక్రమంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
కార్డియోపతిక్ డిపార్ట్‌మెంట్ హెడ్, సమావేశ నిర్వహణా కార్యదర్శి అయిన డాక్టర్ నిర్మల్ గుప్తా మాట్లాడుతూ మనదేశానికి మరింతమంది గుండెసంబంధ వ్యాధి నిపుణులు, సర్జన్ల అవసరం ఉందన్నారు. ఈ సంఖ్య పెరిగేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. అప్పుడుగానీ భారత్ అభివృద్ధి పరంగా ముందడుగు వేయలేదని ఆయన అన్నారు. భారత్‌లో గుండె జబ్బులు అధికంగా ఉన్నాయని, ఈ అనారోగ్యాలు వారి ఉత్పత్తి సామర్ధ్యాన్ని, ఉత్పాదకతలో ఉండగలిగిన వయసునీ తగ్గించివేస్తున్నాయని ఆయన అన్నారు.
మెడికల్ కాలేజీలు తెరిచినా, సీట్లు పెంచినా ఈ సమస్యలకు పరిష్కారం ఉండదని సమావేశంలో నిపుణులు అభిప్రాయపడ్డారు. గుండెవైద్యంలో సర్జన్లు పెరిగితేనే కాబోయే వైద్యులకు ఈ విషయంలో సరైన బోధన అందుతుందని వారు సూచించారు.
cardiology,Heart Specialist
https://www.teluguglobal.com//2016/02/18/heart-specialist-doctors/