గుజరాత్‌‌లో ఘోర రోడ్డు ప్రమాదం..9 మంది దుర్మరణం

2025-02-21 10:07:32.0

గుజరాత్‌ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

గుజరాత్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కచ్‌ జిల్లాలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు.. ఓ ట్రక్కును బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రోడ్డు ప్రమాదంతో అప్రమత్తమైన స్థానికులు, ఇతర వాహనదారులు క్షతగాత్రులను అత్యవసర చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. వారికి చికిత్స కొనసాగుతుండగా.. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Gujarat,Road accident,Kutch district,Crime news,PM modi,truck