2016-03-26 05:33:12.0
గుడ్డుని పగుల గొట్టి, లేదా ఉడికించి కూరవండుకుని తినడమే మనకు తెలుసు..కానీ ఫరా సయీద్ కి మాత్రం గడ్డుని చూస్తే ఎన్నో గుడ్ అయిడియాలు తన్నుకువస్తాయి. అందుకే ఆమె అమెరికాలో ప్రముఖ భారత ఎగ్ ఆర్టిస్ట్‌గా పేరు తెచ్చుకోగలిగారు. ఇటీవల చికాగోలో ఆమె నిర్వహించిన గుడ్డు కళాకృతుల ప్రదర్శన కళాభిమానుల మనసులను సమ్మోహన పరచింది. చిగాకో సింఫనీ సెంటర్‌లో ఈ నెల 20, 21 తేదీల్లో తాను రూపొందించిన 70 కళాకృతులను ప్రదర్శించారామె. వీటన్నింటిలో ప్రాథమికంగా […]
http://www.teluguglobal.com/wp-content/uploads/2016/03/egg.gif
గుడ్డుని పగుల గొట్టి, లేదా ఉడికించి కూరవండుకుని తినడమే మనకు తెలుసు..కానీ ఫరా సయీద్ కి మాత్రం గడ్డుని చూస్తే ఎన్నో గుడ్ అయిడియాలు తన్నుకువస్తాయి. అందుకే ఆమె అమెరికాలో ప్రముఖ భారత ఎగ్ ఆర్టిస్ట్‌గా పేరు తెచ్చుకోగలిగారు. ఇటీవల చికాగోలో ఆమె నిర్వహించిన గుడ్డు కళాకృతుల ప్రదర్శన కళాభిమానుల మనసులను సమ్మోహన పరచింది. చిగాకో సింఫనీ సెంటర్‌లో ఈ నెల 20, 21 తేదీల్లో తాను రూపొందించిన 70 కళాకృతులను ప్రదర్శించారామె. వీటన్నింటిలో ప్రాథమికంగా ఉపయోగించిన వస్తువు… వివిధ పక్షుల తాలూకూ గుడ్ల పెంకు భాగమే. గినియా, టర్కీ, నిప్పుకోడి…ఇంకా పలురకాల బాతులు, కొంగల గుడ్ల లోపలి భాగాన్ని తీసేసి డొల్లగా మారిన గుడ్డుని ఉపయోగించి అందమైన కళా రూపాలు తయారుచేశారు.
ఇంకా పలురకాల రంగురాళ్లు, బంగారం, వెండిలాంటి ఆభరణాలు .. ఎన్నో అలంకరణ వస్తువులను సైతం ఆమె ఈ కళాకృతుల్లో వినియోగించారు. పదిహేడేళ్ల క్రితం ఖతర్‌లో ఉండగా ఫరా సయీద్ ఎగ్ ఆర్ట్‌ని మొదటిసారిగా చూశారు. అప్పటి నుండి దానిపై మక్కువతో కృషి చేశారు. ప్రస్తుతం ఆమె అమెరికాలో ఉంటున్నారు. ఆమె భర్త డాక్టర్ అసాఫ్ సయీద్ చికాగోలో ఇండియా కాన్సుల్ జనరల్‌గా ఉన్నారు.
అతి సున్నితంగా ఉండే గుడ్డు పెంకు మీద చిత్రాన్ని గీయాలన్నా, రంగులు వేయాలన్నా, అలంకరణ చేయాలన్నా చాలా కష్టమైన పని. కానీ ఫరా సయీద్ ఆ పనులన్నీ చాలా తేలిగ్గా చేయగలరు. ఈ కళకు అంతు లేదని, ఎంత సృజననైనా ఇందులో ప్రదర్శించవచ్చని ఆమె అంటారు. ఇంతకుముందు కూడా ఆమె కోపెన్ హగన్, న్యూఢిల్లీ, సానాల్లో సోలోగా ప్రదర్శనలు నిర్వహించారు.
Egg Art