గురువందనం (కవిత)

2023-07-03 07:15:23.0

https://www.teluguglobal.com/h-upload/2023/07/03/790816-guru-vandanam-kavitha.webp

మానవ జన్మకవసరము

జ్ఞానమె పరమార్థమగుట

జ్ఞప్తి కినుండన్

మానసపు బండరాతిని

సానను పట్టును గురువులు చదువులు జెప్పన్

గురువులకు గురువు వ్యాసుడు

పరమాత్ముడు వేరుగాడు

వ్యాసుని కంటెన్

నిరుపమముగ నందించెను

వరుసగ వేదములు నాల్గు

వాసిగ నొప్పన్

భారత భాగవతాదుల

సారము నందింపగ భవసాగరమంతన్

పారము దాటగ జేయగ

కారణ జన్ముడుగ బుట్టె

గాథలు జెప్పన్

వ్యాసుల వారసులందరి

మీసరమగు బోధలెల్ల

మేలగు రీతిన్

భాసురముగ పట్టువడగ

వాసిగ దీవెనలనంద

వందన మిడుదున్.

– క్రొవ్విడి వెంకట బలరామమూర్తి

Guru Vandanam,Telugu Kavithalu,Krovvidi Venkata Balarama Murthy