2025-02-19 10:45:36.0
మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన బీఆర్‌ఎస్ పార్టీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం తెలంగాణ భవన్‌లో ప్రారంభమైంది.
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఏడునెలల విరామం తర్వాత ఆ పార్టీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం తెలంగాణ భవన్‌లో ప్రారంభమైంది. అంతకు ముందు ఎర్రవెల్లిలోని వ్యవసాయక్షేత్రం నుంచి కేసీఆర్, తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు తెలంగాణ భవన్ వద్ద బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. పార్టీని స్థాపించి 24 ఏళ్లు పూర్తైంది. 25వ సంవత్సరంలోకి అడుగుపెడుబోతున్న ఈ నేపథ్యంలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై పార్టీ ముఖ్య నాయకులతో చర్చించనున్నారు.
పార్టీ ఆవిర్భావ వేడుకలు, సభ్యత్వ నమోదు, భారీ బహిరంగ సభ తదితర అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే, పార్టీ సభ్యత్వ నమోదు, గ్రామస్థాయి నుంచి పార్టీ నిర్మాణం, తదితర నిర్మాణాత్మక కార్యాచరణపై పార్టీ నేతలకు కాంగ్రెస్ ప్రజావ్యతిరేక విధానాలపై చేపట్టాల్సిన కార్యాచరణపై పార్టీ శ్రేణులకు గులాబి బాస్ దిశానిర్దేశనం చేయనున్నారు. సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు రాష్ట్ర కార్యవర్గం, జిల్లా అధ్యక్షులు, ప్రస్తుత, మాజీ ఎంపీలు, శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు, కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ అధ్యక్షులు, పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జీలు హాజరయ్యారు.
BRS Party,KCR,KTR,Telangana Bhavan,TRS Party,Silver Jubilee Celebration,Former cm KCR,BRS membership,Latest Telugunews,Telugu News,CM Revanth reddy,Congress party