గూగుల్ మ్యాప్స్‌లో ఎయిర్ క్వాలిటీ ఫీచర్.. మీ ఏరియాలో ఎయిర్ క్వాలిటీని ఇలా తెలుసుకోండి

2024-11-19 06:58:40.0

ప్రస్తుతం నగరాల్లో గాలి కాలుష్యం (Air Pollution) ప్రధాన సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో గూగుల్‌ మ్యాప్స్‌ ఒక కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

గూగుల్ మ్యాప్స్‌లో ఎయిర్ క్వాలిటీ ఫీచర్.. మీ మీ ఏరియాలో ఎయిర్ క్వాలిటీని ఇలా తెలుసుకోండి

ప్రస్తుతం నగరాల్లో గాలి కాలుష్యం (Air Pollution) ప్రధాన సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో గూగుల్‌ మ్యాప్స్‌ ఒక కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా వినియోగదారులు తమకు కావాల్సిన ప్రదేశాల్లో గాలి నాణ్యతను, ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ (ఏక్యూఐ)ను సులభంగా తెలుసుకోవచ్చు. ఈ ఫీచర్‌ను ప్రారంభించినప్పటి నుంచి వారం రోజుల్లో 100 కంటే ఎక్కువ దేశాల్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు గూగుల్‌ ప్రకటించింది. దీని ద్వారా ఇండియాలో ఎక్కడైనా గాలి నాణ్యత గురించి సమగ్ర సమాచారం తెలుసుకోవచ్చు. గూగుల్‌ మ్యాప్స్‌లో ఏక్యూఐ రీడింగ్‌లు వినియోగదారులకు సులభంగా అర్థమయ్యే విధంగా ఉంటాయి, అలాగే వాతావరణం, గాలి నాణ్యత వివరాలను త్వరగా తెలుసుకోవడం సులభం.

ఏక్యూఐ స్థాయిలు:

  • – 0–50: ఆరోగ్యానికి మంచిది
  • – 51–100: సంతృప్తికర స్థాయి
  • – 101–200: మితమైన స్థాయి
  • – 201–300: హానికర స్థాయి
  • – 301–400: ప్రమాదకర స్థాయి
  • – 401–500: అత్యంత ప్రమాదకర స్థాయి

గూగుల్‌ వివిధ రంగులను ఉపయోగించి గాలి నాణ్యత వివరాలను మ్యాప్స్‌లో చూపిస్తుంది. ఉదాహరణకు గ్రీన్‌ రంగు ‘గుడ్‌’ గాలి నాణ్యతకు, రెడ్‌ రంగు ‘వెరీ పూర్‌’ నాణ్యతకు సూచికగా ఉంటుంది.

అంతేకాకుండా, గాలి నాణ్యత అనుకూలంగా లేకపోతే గూగుల్‌ మ్యాప్స్‌ హెచ్చరికలు జారీ చేస్తుంది. పరిస్థితి తీవ్రమైనప్పుడు బహిరంగ కార్యకలాపాలకు దూరంగా ఉండమని సూచిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇనాక్టివ్ వ్యక్తులు, వృద్ధులు ఇంట్లోనే ఉండాలని సిఫారసు చేస్తుంది. గాలి నాణ్యత క్షీణించి ఉన్న ప్రాంతాల్లో ఉంటే ఎయిర్‌ ప్యూరిఫైయర్‌ను ఉపయోగించాలని కూడా సలహా ఇస్తుంది. అదనంగా, సరైన ప్యూరిఫైయర్‌ ఎంపికపై పూర్ణ గైడెన్స్‌ కూడా అందిస్తుంది.

Google maps,Air quality index,air quality checker