https://www.teluguglobal.com/h-upload/2022/08/10/500x300_367358-gizmore-gizfit.webp
2022-08-10 10:54:02.0
మొబైల్‌లోనే కాదు చేతికుండే వాచీలో కూడా గేమ్స్ ఆడొచ్చంటోంది దేశీయ మొబైల్ యాక్ససరిస్ కంపెనీ ‘గిజ్‌మోర్’. గేమింగ్ ప్రియుల కోసం సరికొత్త స్మార్ట్‌వాచ్‌ను విడుదల చేసింది. దీని ప్రత్యేకతలేంటంటే..
మొబైల్‌లోనే కాదు చేతికుండే వాచీలో కూడా గేమ్స్ ఆడొచ్చంటోంది దేశీయ మొబైల్ యాక్ససరిస్ కంపెనీ ‘గిజ్‌మోర్’. గేమింగ్ ప్రియుల కోసం సరికొత్త స్మార్ట్‌వాచ్‌ను విడుదల చేసింది. దీని ప్రత్యేకతలేంటంటే..
ఢిల్లీకి చెందిన టెక్ బ్రాండ్ గిజ్‌మోర్ తన లేటెస్ట్ స్మార్ట్‌వాచ్ ‘గిజ్‌ఫిట్ అల్ట్రా’ను లాంఛ్ చేసింది. చతురస్రాకార డయల్‌తో ఉండే ఈ స్మార్ట్‌వాచ్ యాపిల్ వాచ్‌ని తలపిస్తుంది. అయితే ఈ వాచీ ప్రత్యేకతలు మాత్రం పూర్తిగా వేరు.
1.69 అంగుళాల హెచ్‌డీ కర్వ్ డిస్‌ప్లేతో ఉండే ఈ వాచీలో అన్ని రకాల ఫిట్‌నెస్ ఫీచర్లు ఉంటాయి. 60కి పైగా స్పోర్ట్స్ మోడ్స్ ఉన్నాయి. ఆక్సిజన్ లెవల్స్, హార్ట్ బీట్ చూపించే ఫీచర్లతో పాటు మహిళలు నెలసరి తేదీని చెక్ చేసుకునే ఫీచర్ కూడా ఉంది. వాయిస్ సెర్చ్ ఎనేబుల్డ్ అయి ఉన్న ఈ వాచ్‌లో బ్లూటూత్ కాలింగ్‌తో పాటు అలెక్సా, యాపిల్ సిరి వంటి వాయిస్ అసిస్టెంట్లు కూడా పనిచేస్తాయి. ఈ వాచ్ ఐపీ68 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెన్స్‌ను కూడా కలిగి ఉంది.
ఇక అన్నింటికంటే ముఖ్యంగా ఇది కేవలం స్మార్ట్‌వాచ్ మాత్రమే కాదు, గేమింగ్ వాచ్ కూడా. ఇందులో మూడు ప్రీ ఇన్‌స్టాల్డ్ గేమ్స్ ఉన్నాయి. ఇంకా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు కూడా. రూ. 2699 ధర ఉన్న గిజ్‌ఫిట్ అల్ట్రా వాచ్ ఆఫర్ కింద ఫ్లిప్‌కార్ట్ లో రూ.1799కే లభిస్తుంది.
Gaming Smartwatch,Gizmore
https://www.teluguglobal.com//science-tech/gizmore-gizfit-ultra-smartwatch-with-three-pre-installed-games-launched-in-india-326403