2025-01-09 12:10:19.0
https://www.teluguglobal.com/h-upload/2025/01/09/1393005-game.webp
గేమ్ ఛేంజర్ సినిమా టికెట్ ధరల పెంపుపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది.
గేమ్ ఛేంజర్ సినిమా టికెట్ ధరల పెంపుపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. తెలంగాణలో తెల్లవారుజామున గేమ్ చేంజర్ సినిమాకు అదనపు షోలకు ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. అదనపు షోలు, షో టైమింగ్స్, ప్రేక్షకుల రద్దీ నియంత్రణకు సంబంధించి శుక్రవారం ఆదేశాలు ఇస్తామన్న హైకోర్టు. అలాగే టికెట్ ధరల పెంపు అంశాన్ని పుష్ప-2 కేసుతో పాటుగా విచారణ జరుపుతామని హైకోర్టు పేర్కొంది.
టికెట్ల పెంపు, స్పెషల్ షోలపై పిటిషన్ వేసిన గొర్ల భరత్ రాజ్ అనే వ్యక్తి లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశాడు. తదుపరి విచారణను తెలంగాణ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. గేమ్ ఛేంజర్ టికెట్ రేట్లను పెంపుకు తెలంగాణ సర్కార్ అనుమతి ఇచ్చింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘గేమ్ చేంజర్’. జనవరి 10న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీకాంత్, అంజలి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఎస్‌జే సూర్య విలన్‌గా నటిస్తున్నాడు. తమన్ సంగీతం అందించాడు.
game changer movie,Telangana High Court,Increase in ticket prices,Ram Charan,Kiara Advani,Hero Srikanth,Anjali,SJ Surya Additional shows,show timings,CM Revanth reddy,Telangana goverment