‘గేమ్ ఛేంజర్‌ నుంచి సెకండ్ సాంగ్‌ రిలీజ్..మాములుగా లేదు

https://www.teluguglobal.com/h-upload/2024/09/30/500x300_1364608-ram-charan.webp

2024-09-30 11:05:42.0

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న గేమ్ ఛేంజర్ మూవీ నుంచి సెకండ్ సింగిల్ సాంగ్ విడుదలైంది. రా మచ్చా మచ్చా అంటూ సాగే పాట లిరికల్ వీడియోను మూవీ యూనిట్ రిలీజ్ చేశారు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న గేమ్ ఛేంజర్ మూవీ నుంచి సెకండ్ సింగిల్ సాంగ్ విడుదలైంది. రా మచ్చా మచ్చా అంటూ సాగే పాట లిరికల్ వీడియోను మూవీ యూనిట్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తుండగా దిల్‌రాజ్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘జరగండి జరగండి’ అనే పాటకు మంచి రెస్పాన్స్‌ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సాంగ్‌ కూడా మెగా ఫ్యాన్స్‌ను ఊపేయడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా..

ఈ పాట‌ను ప్ర‌ముఖ లిరిసిస్ట్ అనంత్ శ్రీరామ్ రాశారు. ఈ సాంగ్‌లో సుమారు వెయ్యి మందికి పైగా డ్యాన్సర్స్‌ పాల్గొన్నారని తెలుస్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, ఒరిస్సా, క‌ర్ణాట‌క‌, వెస్ట్ బెంగాల్‌, జార్ఖండ్ రాష్ట్రాల‌కు చెందిన జాన‌ప‌ద క‌ళాకారులు కూడా ఈ పాటలో స్టెప్పులేశారు. ఈ సినిమాను క్రిస్మస్ సందర్భంగా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్స్‌ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది.

game changer movie,hero Ram Charan,Second single song,Taman music,heroine Kiara Advani,Director Shankar

https://www.teluguglobal.com//cinema-and-entertainment/second-song-release-from-game-changernot-usual-1069022