గొలుసులతో కట్టి.. చిత్రహింసలు పెట్టి .. హత్య చేసి

https://www.teluguglobal.com/h-upload/2024/12/03/1382948-murdered-warangal-city.webp

2024-12-03 09:04:58.0

వరంగల్‌ నగరంలోని రంగంపేటలో హత్యకు గురైన రిటైర్డ్‌ బ్యాంక్‌ ఎంప్లాయ్‌

వరంగల్‌ నగరంలోని రంగంపేటలో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. కాళ్లు చేతులు కట్టేసి దుండగులు హత్య చేశారు. అనంతరం కారులో మృతదేహాన్ని వదిలేసి పారిపోయారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మట్టెవాడ ఠాణా పరిధిలో కారులో ఓ వ్యక్తి మృతదేహం ఉండటాన్ని స్థానికులు గమనించారు. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ వ్యక్తిని గొలుసులతో కట్టి చిత్రహింసలు పెట్టి హత్య చేసి ఉంటారని, ఎక్కడో చంపి ఇక్కడ కారులో వదిలి వెళ్లినట్లు పోలీసులు చెబుతున్నారు. క్లూస్‌ టీమ్‌తో ఘటనాస్థలిలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హత్యకు గురైన వ్యక్తిని హనుమకొండలోని రాఘవేంద్రకాలనీకి చెందిన రిటైర్డ్‌ బ్యాంక్‌ ఎంప్లాయ్‌ ఎలిగేటి రాజామోహన్‌గా గుర్తించారు. 

Tied with chains,Tortured,Murdered,Rangampet,Warangal city