https://www.teluguglobal.com/h-upload/2023/12/07/500x300_868344-biting-nails.webp
2023-12-07 10:45:06.0
చాలామందికి గోళ్లు కొరికే అలవాటు ఉంటుంది. అయితే ఈ అలవాటు మొదలవ్వడానికి కొన్ని కారణాలున్నాయని స్టడీలు చెప్తున్నాయి.
చాలామందికి గోళ్లు కొరికే అలవాటు ఉంటుంది. అయితే ఈ అలవాటు మొదలవ్వడానికి కొన్ని కారణాలున్నాయని స్టడీలు చెప్తున్నాయి. అసలీ అలవాటు ఎందుకు వస్తుంది. గోళ్లు కొరికే అలవాటుని మానేయడం ఎలా అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
గోళ్లు కొరికే అలవాటుని ఒనిచోఫేజియా అంటారు. చాలామంది పిల్లలు దీన్ని ఎక్కడో చూసి అలవాటు చేసుకుంటారట. అలా ఇదొక హ్యాబిట్‌గా మారొచ్చు. అలాగే ఈ అలవాటుకి మెదడుతో కూడా సంబంధం ఉంది.
బోరింగ్‌గా ఫీలవుతున్నప్పుడు మెదడుకి ఏదో ఒక పనిచేయాలన్న ఆలోచన వస్తుంది. అందులో భాగంగానే కొంతమందికి గోళ్లు కొరకడం అలవాటవుతుందట. అలాగే టెన్షన్ పడుతున్నప్పుడు, నెర్వస్‌గా ఫీలవుతున్నప్పుడు ఆ నెర్వస్‌నెస్.. గోళ్లు కొరకడం ద్వారా బయటకొస్తుంటుంది.
నెయిల్ బైటింగ్ అనేది రిపిటీటివ్ బిహేవియర్ కిందకు వస్తుంది. అంటే ఏదైనా సందర్భంలో ఒక ఫీలింగ్‌ను గోళ్లు కొరికే అలవాటుతో లింక్ చేస్తే.. ఇక తర్వాత అది అలాగే కంటిన్యూ అవుతుంది. ఎప్పుడు అలాంటి ఫీలింగ్ కలిగినా హ్యాబిట్ రిపీట్ అవుతూ ఉంటుంది. చాలామంది తమకు తెలియకుండానే ఆ అలవాటులో పడుతుంటారు. అందుకే చాలాసార్లు ‘ఎందుకలా గోళ్లు కొరుకుతున్నావ్’ అని పక్కవాళ్లు అడిగే వరకూ వాళ్లకు ఆ విషయం తెలియదు.
నెయిల్ బైటింగ్ అలవాటు వల్ల పెద్దగా నష్టం లేకపోయినప్పటికీ.. ఇది బాడీ లాంగ్వేజ్‌ను దెబ్బ తీస్తుంది. ఇతరులకు మీరు ఒత్తిడి లేదా టెన్షన్‌లో ఉన్నారని ఈజీగా తెలిసిపోతుంది. అలాగే గోళ్లలో ఉండే క్రిములు తరచూ నోటిలోకి వెళ్లే అవకాశమూ లేకపోలేదు. కాబట్టి దీన్ని మానేయడం బెటర్.
ఈ హ్యాబిట్‌ను మానేయాలంటే ముందుగా ఏయే సందర్భాల్లో గోళ్లు కొరుకుతున్నారో గమనించుకోవాలి. ఒత్తిడి, టెన్షన్ వంటివి వస్తున్నప్పుడు వాటికి గల కారణంపై శ్రద్ధ పెట్టాలి. కాన్షియస్‌గా చేతులను కంట్రోల్‌లో ఉంచుకోవాలి. చేతులను బిజీగా ఉంచడం మెదడుకి అలవాటైంది కాబట్టి దాన్ని రీప్లేస్ చేయడం కోసం స్ట్రెస్ బాల్ లేదా ఇతర ఆబ్జెక్ట్స్ ఏవైనా వెంట ఉంచుకోవాలి. గోళ్లు కొరికే టైంలో ఆ ఆబ్జెక్ట్స్‌ను చేతిలో ఉంచుకోవాలి.
ఈ అలవాటు మరీ ఎక్కువైతే అదొక అబ్సెషన్‌లా మారుతుంది. అంటే అదేపనిగా గోళ్లు కొరకాలి అనిపిస్తుంది. ఈ అలవాటుని తగ్గించడం కోసం బిహేవియరల్ థెరపీలు కూడా ఉన్నాయి అంటే ఇదెంత ప్రమాదకరమైన అలవాటో అర్థం చేసుకోవచ్చు.
Nail Biting,Nails,Habit,Health Tips
Nail Biting, Nails, Telugu News, Telugu Global News, Latest Telugu News, Health, Health News, Habit, Health, Health Tips, నెయిల్ బైటింగ్, నెయిల్, గోళ్లు, గోళ్లు కొరికే అలవాటు, గోళ్లు కొరకడం
https://www.teluguglobal.com//health-life-style/what-causes-the-habit-of-biting-nails-979387