2024-08-17 08:58:32.0
భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా? కావాలని చేశారా? అనే కోణంలో విచారిస్తున్నట్టు డీఎస్పీ తెలిపారు.
https://www.teluguglobal.com/h-upload/2024/08/17/1352905-gas-cylinder-exploded-and-three-were-burnt-alive-in-rayachoti-mandal.webp
గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు సజీవదహనమైన హృదయ విదారక ఘటన అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం కొత్తపేటలో శనివారం జరిగింది. మృతిచెందినవారిలో తల్లి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొత్తపేటలోని తొగట వీధిలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో లక్కిరెడ్డిపల్లె మండలం ఎర్రగుడికి చెందిన రమాదేవి (34), ఆమె ఇద్దరు పిల్లలు మనోహర్ (8), మన్విత (5) ప్రాణాలు కోల్పోయారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. రాయచోటి డీఎస్పీ రామచంద్రయ్య ఘటనాస్థలిని పరిశీలించారు. ఇంట్లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు. రమాదేవి భర్త రాజా ఉపాధి కోసం కువైట్ వెళ్లాడు. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా? కావాలని చేశారా? అనే కోణంలో విచారిస్తున్నట్టు డీఎస్పీ తెలిపారు. సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించిన అనంతరం నిజానిజాలు వెల్లడయ్యే అవకాశముందని ఆయన వివరించారు.