2025-01-31 15:42:50.0
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా వి. నరేందర్‌రెడ్డిని ఖరారు చేసింది.
నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా వి. నరేందర్‌రెడ్డిని ఖరారు చేసింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సిటింగ్ ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి పోటీ తాను పోటీలో ఉండబోనని ఏఐసీసీకి తెలిపారని శ్రీధర్‌బాబు పేర్కొనడంతో నరేందర్‌రెడ్డి అభ్యర్థిత్వానికి లైన్‌క్లియర్ తెలుస్తోంది. జీవన్‌రెడ్డిపై ఉన్న గౌరవభావంతోనే ఆయన పేరును టీపీసీసీ… ఏఐసీసీకి పంపనుంది. ఫిబ్రవరి మూడో తేదీన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి నోటిఫికేషన్ విడుదల కానుంది.
పదో తేదీ వరకు నామినేషన్ల దాఖలుకు గడువు ఉంటుంది. ఫిబ్రవరి 11వ తేదీన నామినేషన్ల పరిశీలన చేపడతారు. నామినేషన్ల ఉపసంహరణకు 13వ తేదీ వరకు గడువు ఉంటుంది. ఫిబ్రవరి 27వ తేదీన ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. మార్చ్ మూడో తేదీన ఓట్ల లెక్కింపు చేపడతారు. ఎన్నిక ప్రక్రియను మార్చి 8వ తేదీ వరకు పూర్తి చేయాలని ఈసీ స్పష్టం చేసింది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఆయా జిల్లాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి తక్షణమే అమల్లోకి వచ్చినట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది
graduate MLC candidate,Congress candidate,V. Narender Reddy,T. Jeevan Reddy,CM Revanth Reddy,BRS Party,KCR,KTR