2025-02-23 14:58:41.0
మొదటి రోజు ప్రశాంతంగా ముగిశాయని ఏపీపీఎస్సీ ప్రకటన
https://www.teluguglobal.com/h-upload/2025/02/23/1406135-appsc.webp
గ్రూప్-2 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని ఏపీపీఎస్సీ తెలిపింది. ఆదివారం నిర్వహించిన గ్రూప్-2 మెయిన్స్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న 92,250 అభ్యర్థుల్లో 86,459 మంది హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోగా.. వారిలో 92 శాతం మంది హాజరయ్యారని అధికారులు వెల్లడించారు. గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలని ప్రభుత్వం సూచించినా సర్వీస్ కమిసన్ మాత్రం యథావిధిగా పరీక్ష నిర్వహించింది. శనివారం రాత్రి వరకు పరీక్ష నిర్వహణపై తీవ్ర ఉత్కంఠ నెలకొన్నది. చివరి వరకు వాయిదా పడుతుందన్న ఆశతో ఉన్నవారు దూర ప్రాంతాల్లో ఉన్న పరీక్ష కేంద్రాలకు చేరుకోవడానికి ఇబ్బంది పడ్డారు.