2025-02-11 16:15:40.0
ఏఐ, మిషన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ వంటి సాంకేతికతను ఇప్పటికే మనం అందిపుచ్చుకున్నామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.
ఏఐ, మిషన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ వంటి సాంకేతికతను ఇప్పటికే మనం అందిపుచ్చుకున్నామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో 32వ హైసియా (హైదరాబాద్ సాఫ్ట్ వేర్ ఎంటర్‌ప్రైజెస్ అసోసియేషన్) సమ్మిట్‌లో ఆయన మాట్లాడుతూ, ఐటీలో మరిన్ని ఉద్యోగాలు సృష్టిస్తామని అన్నారు. రాష్ట్రంలో సాంకేతిక వినియోగంపై సీఎం రేవంత్ రెడ్డి పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతున్నారని అన్నారు. హైదరాబాద్ అంతర్జాతీయ పారిశ్రామిక, ఐటీ హబ్‌గా ఉందని ఆయన చెప్పారు. ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్), మిషన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ ప్రపంచాన్ని ఏలబోతున్నాయని తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. రాష్ట్రంలో మౌలిక సదుపాయాలకు ఎలాంటి లోటు లేదని, గ్లోబల్ హబ్‌గా హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దుతామని ఆయన అన్నారు
Minister Sridhar Babu,CM Revanth reddy,Congress party,AI,Mission Learning,Cyber Security