2024-08-30 03:39:09.0
ఎన్నికలు ఒక సునామీలాగా జరిగాయన్నారు రోజా. ప్రజలు తమను ఓడించలేదని చెప్పుకొచ్చారు.
https://www.teluguglobal.com/h-upload/2024/08/30/1355791-roja-2.webp
ఎన్నికల్లో వైసీపీ మరీ అంత దారుణంగా ఓడిపోవాల్సింది కాదని అన్నారు మాజీ మంత్రి రోజా. అంత ఘోరమైన తప్పులు తామేమీ చేయలేదన్నారు. ఘోర ఓటమికి ప్రజలు కూడా కారణం కాదన్నారు. అసలు కారణాలు, నిజా నిజాలు నిలకడమీద తెలుస్తాయని అన్నారు. ప్రజలకు కూడా నిజాలు తెలిసొస్తాయన్నారు రోజా.
ఇటీవల కొంతకాలం మీడియాకు, పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్న రోజా, మళ్లీ పొలిటికల్ గా యాక్టివ్ అవుతున్నట్టు తెలుస్తోంది. తన నియోజకవర్గంలో బలిజ భవన్ ని ప్రారంభించిన ఆమె, పార్టీ నేతలు, కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. ఓడిపోయినా తాము ప్రజలకు అందుబాటులో ఉంటామని, ప్రజలకు అండగా నిలబడతామన్నారు. ఓడిపోయినంత మాత్రాన తాము వెనక్కి తగ్గేది లేదన్నారు.
ఎన్నికలు ఒక సునామీలాగా జరిగాయన్నారు రోజా. ప్రజలు తమను ఓడించలేదని చెప్పుకొచ్చారు. అందరూ తనవాళ్లే అనుకున్నాను కాబట్టే, నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానన్నారామె. ప్రభుత్వం కూడా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని, కానీ ఓటమి తప్పలేదన్నారు. ఈ ఓటమికి అసలు కారణాలు నిదానంగా తెలుస్తాయన్నారు రోజా.