https://www.teluguglobal.com/h-upload/2024/11/01/1374147-drug.webp
2024-11-01 05:16:27.0
రాజస్థాన్‌కు చెందిన వ్యక్తి నుంచి 155 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం చేసుకున్న నార్కోటిక్ అధికారులు
హైదరాబాద్ చందానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నార్కోటిక్ డ్రగ్స్ కంట్రోల్ అధికారులు డ్రగ్స్ పట్టుకున్నారు. నిందితుడి నుంచి 155 గ్రాముల ఎండీఎంఏ ను స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్‌కు చెందిన కృష్ణారామ్ గురువారం హైదరాబాద్‌కు వచ్చాడు. అతనితో పాటు ఎండీఎంఏ డ్రగ్స్ తీసుకొచ్చాడు. గుల్‌మొహర్ పార్క్ కాలనీలో నివాసం ఉంటున్న వ్యాపారి ఇంటికి నిందితుడు డ్రగ్స్ తీసుకువచ్చాడు. డ్రగ్స్ అమ్ముతుండగా పోలీసులు పట్టుకున్నారు. మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకుని చందానగర్ పోలీసులకు అప్పగించారు. అతనితో పాటు ఏడుగురిపై కేసు నమోదు చేశారు.పక్కా సమాచారంతో ఎన్‌సీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇద్దరు నిందితుల కోసం చందానగర్ పోలీసులు గాలిస్తున్నారు. పట్టుబడిన డ్రగ్స్ విలువ రూ. 18 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.
Drugs,Seized,Chandanagar PS,MDMA